Heavy Rains Expected in Telangana: తెలంగాణలో 21 వరకు భారీ వర్షాలు
ABN , Publish Date - Aug 11 , 2025 | 04:28 AM
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈనెల 21 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ
పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్
హైదరాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
హైదరాబాద్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈనెల 21 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే రెండు వారాల పాటు ముసురు పట్టి, వాతావరణం పూర్తిగా చల్లబడి, జల్లులు, అప్పుడప్పుడు భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. సోమ, మంగళవారాల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. అదేవిధంగా, ఈనెల 13 నుంచి 16 వరకు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ నాలుగు రోజులకు గాను రాష్ట్రవ్యాప్తంగా ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఇక, హైదరాబాద్‌లో రాబోయే 48 గంటల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు, ఈనెల 13 నాటికి వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కూడా వెల్లడించింది.