Heavy Rain: నేడు, రేపు భారీ వానలు!
ABN , Publish Date - May 17 , 2025 | 03:03 AM
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా కురిసే అవకాశం
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి
హైదరాబాద్, మే 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గద్వాల, వనపర్తి, నారాయణపేట, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్లగొండ, యాదాద్రి, మేడ్చల్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది.