Share News

Rain In Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ జామ్..

ABN , Publish Date - May 26 , 2025 | 05:25 PM

Rain In Hyderabad: ఉత్తర తెలంగాణపై ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణలో సోమవారం నుంచి గురువారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

Rain In Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ జామ్..
Rain In Hyderabad

ఈ సంవత్సరం ముందుగానే వర్షాకాలం వచ్చింది. గత కొద్దిరోజుల నుంచి దేశ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక, తెలుగు రాష్ట్రాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మహా నగరం హైదరాబాద్‌లో సోమవారం భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిలింనగర్‌, గచ్చిబౌలి, హైటెక్‌ సిటీ, మాదాపూర్, మణికొండ, మెహిదీపట్నం, టోలిచౌకీ, మాసబ్‌ట్యాంక్‌, నాంపల్లిలో వర్షం పడింది.


వర్షం కారణంగా ఐటీ కారిడార్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక, ఉత్తర తెలంగాణపై ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణలో సోమవారం నుంచి గురువారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజమాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.


ఇవి కూడా చదవండి

ప్రేమలో మీరు నిజాయితీపరులా లేక మోసగాళ్లా.. ఫొటో చూసి తెలుసుకోండి..

ఇదేందయ్యా ఇది.. జలపాతాన్ని తలపిస్తున్న మెట్రో స్టేషన్..

Updated Date - May 26 , 2025 | 05:25 PM