Health Minister Rajanarsimha : హెచ్‌ఎంపీవీ గురించి భయం వద్దు
ABN , Publish Date - Jan 07 , 2025 | 05:26 AM
హ్యూమన్ మెటానిమో వైర్‌స(హెచ్‌ఎంపీవీ) అనేది కొత్త వైరస్ కాదని, 2001 నుంచే ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వ్యాప్తిలో ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. ఈ వైరస్ శ్వాసకోశ వ్యవస్థపై స్వల్ప ప్రభావమే

ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం
అన్ని రకాల వైద్య సదుపాయాలున్నాయి
తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోం
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర
హైదరాబాద్, జనవరి6(ఆంధ్రజ్యోతి): హ్యూమన్ మెటానిమో వైర్‌స(హెచ్‌ఎంపీవీ) అనేది కొత్త వైరస్ కాదని, 2001 నుంచే ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వ్యాప్తిలో ఉందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. ఈ వైరస్ శ్వాసకోశ వ్యవస్థపై స్వల్ప ప్రభావమే చూపిస్తుందన్నారు. వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అతని నోటి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా మరొకరికి వైరస్ వ్యాపిస్తుందన్నారు. చైనాలో ఈ ఏడాది హెచ్‌ఎంపీవీ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నట్టు తెలిసిందని చెప్పారు. ఇతర దేశాల్లో, ఇతర రాష్ర్టాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు. కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులతో, మన రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నారని చెప్పారు. ఈ వైరస్ విషయంలో ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదని, జాగ్రత్తగా ఉంటే సరిపోతుందన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ సిద్ధంగా ఉందన్నారు. డిసీజ్ సర్వైలైన్స్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, అన్నిరకాల వనరులతో సిద్ధంగా ఉండాలంటూ ఉన్నతాధికారులను, జిల్లా అధికారులను అప్రమత్తం చేశామన్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రజలను భయబ్రాంతులకు గురిచేేసలా నిరాధార, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేేస్త, ప్రభు త్వం చాలా సీరియ్‌సగా పరిగణిస్తుందని హెచ్చరించారు.