Harish Rao: రేవంత్ బ్యాచ్ ఢిల్లీ డ్రామా అట్టర్ ఫ్లాప్
ABN , Publish Date - Aug 07 , 2025 | 04:00 AM
అడగాల్సిన చోట అడగకుండా.. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల సాధన పేరిట రేవంత్‌రెడ్డి బ్యాచ్ ఢిల్లీలో చేసిన డ్రామా అట్టర్‌ఫ్లాప్ అయిందని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ఎద్దేవా చేశారు.
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ది రెండు నాల్కల ధోరణి: హరీశ్
హైదరాబాద్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): అడగాల్సిన చోట అడగకుండా.. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల సాధన పేరిట రేవంత్‌రెడ్డి బ్యాచ్ ఢిల్లీలో చేసిన డ్రామా అట్టర్‌ఫ్లాప్ అయిందని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఒకే రోజు, ఒకే సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలకు, రాహుల్‌గాంధీ ‘ఎక్స్’లో పోస్టు చేసిన వ్యాఖ్యలకు పొంతనే లేదని ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు.
ఢిల్లీలో ప్రధాని మోదీని ఉద్దేశించి రేవంత్ మాట్లాడుతూ తెలంగాణలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు పెంచాలని మాత్రమే తాము అడుగుతున్నామని పేర్కొనగా.. ఇది తెలంగాణ కోసం మాత్రమే కాదని, యావత్ దేశం కోసం చేస్తున్న పోరాటమని రాహుల్ ‘ఎక్స్’ వేదికగా వ్యాఖ్యానించడం..వారిలో చిత్తశుద్ధి లేదనడానికి నిదర్శనమని దుయ్యబట్టారు.