Share News

కేసీఆర్‌ వ్యాఖ్యలపై రేవంత్‌ వక్రీకరణ:హరీశ్‌

ABN , Publish Date - Jun 19 , 2025 | 03:41 AM

గోదావరిపై బనకచర్ల ప్రాజెక్టుపై అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు- నాటి సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలను సీఎం రేవంత్‌ వక్రీకరించారని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆరోపించారు.

కేసీఆర్‌ వ్యాఖ్యలపై రేవంత్‌ వక్రీకరణ:హరీశ్‌

హైదరాబాద్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): గోదావరిపై బనకచర్ల ప్రాజెక్టుపై అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు- నాటి సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలను సీఎం రేవంత్‌ వక్రీకరించారని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం వక్రబుద్దితో సీఎం ప్రజల ముందు అసత్యాలు ఉంచారని, కానీ ఆయనకు తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడాలన్న తపనే లేదని ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు పెట్టారు.


ప్రజలను తప్పుదోవ పట్టించడానికి అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశ అజెండా-5ను దాచి పెట్టి, అజెండా-1 అంశాలే ప్రస్తావించారని హరీశ్‌ చెప్పారు. గోదావరి- కృష్ణా నదుల అనుసంధాన ప్రాజెక్టులపై ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణను సంప్రదించకుండా ముందుకెళ్లరాదని అజెండా-5లో నాడు కేసీఆర్‌ స్పష్టంగా పేర్కొన్నారని వెల్లడించారు.

Updated Date - Jun 19 , 2025 | 03:41 AM