Share News

రైతు సంబురాలు నిర్వహించడం సంతోషం

ABN , Publish Date - Jan 16 , 2025 | 11:40 PM

సంక్రాంతి అంటేనే రైతుల పండుగ అని, రైతు సంబురాలలో భాగంగా ఎద్దుల బండలాగుడు పోటీలు నిర్వహించడం ఎంతో సంతోషకరమని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

రైతు సంబురాలు నిర్వహించడం సంతోషం
బహుమతులు అందజేస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

- అంతర్రాష్ట్ర వృషభరాజముల బండలాగుడు పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు

కోడేరు, జనవరి 16 (ఆంధ్రజ్యోతి) : సంక్రాంతి అంటేనే రైతుల పండుగ అని, రైతు సంబురాలలో భాగంగా ఎద్దుల బండలాగుడు పోటీలు నిర్వహించడం ఎంతో సంతోషకరమని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మన సంస్కృతీ సంప్రదా యాల్లో ఎద్దుల బండ్ల ప్రదర్శన, బండలాగుడు పోటీలు నిర్వహించడం భాగమని ఆయన అన్నారు. మండల కేంద్రంలో అంతర్రాష్ట్ర వృష భరాజముల బండలాగుడు పోటీల్లో విజేతలకు గురువారం మంత్రి బహుమతులను అందజేశా రు. మొదటి బహుమతి షేక్‌ మహమ్మద్‌ షరీఫ్‌ నారాయణపురం (అనంతపురం జిల్లా) 2853.5 అడుగులు బండ లాగి రూ.80 వేల బహుమతిని గెలుచుకు న్నారు. రెండవ బహుమతి నంద్యాల జిల్లా పీఆర్‌పల్లికి చెందిన ఎం.నాగయ్య ఎద్దులు రూ. 60వేలు, మూడో బహు మతిగా నాగర్‌కర్నూల్‌ యాది రెడ్డిపల్లికి చెందిన డాక్టర్‌ అఖి లేష్‌రెడ్డి ఎద్దులకు రూ. 50 వేలు గెలుచుకున్నారు. ఇలా ఎనిమిది బహుమతులుగా వివి ధ జిల్లాలకు చెందిన రైతు లకు బహుమతులు అందజే శారు. బండు లాగుడు పోటీలలో పాల్గొని విజయవంతం చేసిన మండల ప్రజలను అభినందించారు.

మంత్రికి పంచాయతీ కార్మికుల వినతి

పెండింగ్‌ వేతనాలు వెంటనే చెల్లించాలని పంచాయతీ కార్మికులు ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు గురువారం వినతి పత్రం అందజేశారు. గ్రామ పంచాయతీ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు సాయిబాబు మాట్లాడుతూ ఐదు నెలల నుంచి జీతాలు లేక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. పస్తులుండి పని చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం జీతాలు వెంటనే చెల్లించాలని మంత్రిని కోరారు.

Updated Date - Jan 16 , 2025 | 11:40 PM