దివ్యాంగుల ఉపకరణాల ఎంపిక శిబిరం
ABN , Publish Date - Feb 20 , 2025 | 11:23 PM
పట్టణంలోని రైతు వేదికలో లక్షెట్టిపేట మాత శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట మూడు మండలాలకు చెందిన దివ్యాంగులకు సహా యక ఉపకరణాల పంపిణీ ఎంపిక శిబిరాన్ని ఏర్పాటు చేసారు.
లక్షెట్టిపేట, ఫిబ్రవరీ 20(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని రైతు వేదికలో లక్షెట్టిపేట మాత శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట మూడు మండలాలకు చెందిన దివ్యాంగులకు సహా యక ఉపకరణాల పంపిణీ ఎంపిక శిబిరాన్ని ఏర్పాటు చేసారు. ఈకార్య క్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ రౌఫ్‌ఖాన్ హాజరై మాట్లా డారు. దివ్యాంగుల సౌకర్యార్థం అలీవ్ కంపని సహకారంతో పరికరాలను, అదే విధంగా చేతికర్రలు, సంక కర్రలు, చెవి మిషన్లు, ట్రైసైకిళ్లను, ఎలక్ర్టిక్ ట్రైసైకిళ్లను అందజేసేందుకు లబ్దిదారుల ఎంపిక కోసం దరకాస్తులను తీసుకుంటున్నామన్నారు. మూడు మండలాల నుంచిసుమారు 440మంది దివ్యాంగులు పాల్గొని వివిధ పరికరాల కోసం దరకాస్తు చేసుకున్నట్లు వా టిని పరిశీలించి త్వరలోనే సహాయక ఉపకరణాలను అందజేస్తామన్నారు. ఈకార్యక్రమంలో సీడీపీవో రేష్మా, మున్సిపల్ కమీషనర్ మారుతిప్రసాద్, సూపర్‌వైజర్ మమతతో పాటు మూడు మండలాల ఎంపీడీవోలు, దివ్యాంగులు పాల్గొన్నారు.
ఫపట్టణంలోని రైతు వేదికలో గురువారం మాత శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉపకరణాల ఎంపిక కార్యక్రమంలో శ్రీసత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో సభ్యులు మద్యాహ్న భోజనం ఏర్పాటు చేసారు. ఈకార్యక్రమంలో సమితి సభ్యులు గంప రవీందర్, నగధర్, రమే ష్, రాంసింగ్, మురళి, శ్రీనివాస్‌తో పాటు సమితి సభ్యులు పాల్గొన్నారు.