Guvvala Balraju: ఫాంహౌస్ కేసులో అభాండాలు మోపారు
ABN , Publish Date - Aug 07 , 2025 | 04:20 AM
ఫాం హౌస్ కేసులో వంద కోట్లకు అమ్ముడుపోయానంటూ నాపై అబాండాలు మోపారు. నన్ను హతమారుస్తామంటూ వేలాది ఫోన్లు వచ్చాయి. ఇంత జరిగినా బీఆర్ ఎస్‌లో నా గురించి ఎవరూ పట్టించుకోలేదు
హతమారుస్తామని వేలాదిగా ఫోన్లు వచ్చాయి
బీఆర్‌ఎస్‌లో నన్నెవ్వరూ పట్టించుకోలేదు
మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
అచ్చంపేట, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ‘‘ఫాం హౌస్ కేసులో వంద కోట్లకు అమ్ముడుపోయానంటూ నాపై అబాండాలు మోపారు. నన్ను హతమారుస్తామంటూ వేలాది ఫోన్లు వచ్చాయి. ఇంత జరిగినా బీఆర్ ఎస్‌లో నా గురించి ఎవరూ పట్టించుకోలేదు’’ అని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆదేశాల ప్రకారమే తనకు ఇచ్చిన రోల్‌ను ఫాంహౌ్‌సలో పోషించానని, ఆ విషయం పార్టీ పెద్దలకు తెలుసని చెప్పారు. బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన తర్వాత మొదటిసారి బుధవారం నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేటకు వచ్చిన ఆయన తన నివాసంలో ముఖ్యకార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను అచ్చంపేటలో అడుగుపెట్టినప్పుడు బీఆర్‌ఎ్‌సకు క్యాడరే లేదని, కష్టపడేతత్వం ఉన్నందున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈ ప్రాంత ప్రజలకు సేవ చేశానని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కనీస అంతర్మథనం కూడా జరగలేదని, ఎంపీ స్థానంలో నిలబడి పార్టీని గెలుపించుకుందామనుకుంటే తనను సంప్రదించకుండానే మరొకరికి సీటు కేటాయించారన్నారు. రెండు జాతీయ పార్టీల నుంచి తనకు ఆహ్వానం ఉన్నా.. పేదల కోసం పనిచేసే వైపే ఉం డాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ను వీడవద్దని, రాజీనామాను వెనక్కి తీసుకోవా లని కోరుతూ కొందరు కార్యకర్తలు కన్నీరుపెట్టారు.
బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా ఈ నెల 9,10 తేదీల్లో ధర్నాలు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
హైదరాబాద్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): బీసీలకు 42ు రిజర్వేషన్ల బిల్లును కేంద్రం వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 9, 10 తేదీల్లో ఆందోళనలు చేపట్టనున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తెలిపారు. హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో ఎస్. వీరయ్య అధ్యక్షతన బుధవారం జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ.. తెలంగాణలో మాత్రం ఆ పార్టీ నేతలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి.. కలిసి వచ్చే శక్తులందరితో కలిసి ఐక్యంగా ఉద్యమించాలని, దానికి సీపీఎం మద్దతు ఉంటుందని తెలిపారు. కాగా, మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని జాన్ వెస్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆందోళనకు దిగిన కార్మికులను అరెస్టు చేయడాన్ని సీపీఎం ఖండిస్తోందన్నారు.