గుర్రంపోడు తహసీల్దార్, మఠంపల్లి ఎంపీడీవో సస్పెన్షన్
ABN , Publish Date - Feb 26 , 2025 | 12:15 AM
విధుల్లో నిర్లక్ష్యం వహించిన నల్లగొండ జిల్లా గుర్రంపోడు తహసీల్దార్ జి. కిరణ్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు వేటు వేసిన నల్లగొండ, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు
బొమ్మలరామారం గ్రామ కార్యదర్శిపై వేటువేసిన యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్
గుర్రంపోడు, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): విధుల్లో నిర్లక్ష్యం వహించిన నల్లగొండ జిల్లా గుర్రంపోడు తహసీల్దార్ జి. కిరణ్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తహసీల్దార్ కిరణ్‌కుమార్ విజ్ఞప్తి మేరకు గతనెల 6 నుంచి 16వ తేదీ వరకు కలెక్టర్ సెలవులు మంజూరు చేశారు. సెలవు ముగిసిన తర్వాత జనవరి 17న విధుల్లో చేరాల్సి ఉండగా, కిరణ్‌కుమార్ విధుల్లో చేరకుండా సెలవును జనవరి 31వరకు పొడిగించారు. మరోసారి ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు సెలవును పొడగించారు. రాష్ట్ర ప్రబుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు పథకం, రేషన్‌కార్డులు, రైతు భరోసా పథకాల కింద లబ్ధిదారుల ఎంపికతో పాటు, కేంద్ర ఎన్నికల సంఘం వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ జారీచేసిన నేపథ్యంలో కలెక్టర్ కిరణ్‌కుమార్‌కు సెలవు మంజూరు చేయలేదు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు. జిల్లా యం త్రాంగం ఆదేశాలను బేఖాతరు చేసినందుకు వివరణ ఇవ్వాలని తహసీల్దార్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. అయినప్పటికీ ఫిబ్రవరి 25వరకు తహసీ ల్దార్ విధుల్లో చేరకపోవడమే కాకుండా, ఎలాంటి సమాచారం ఇవ్వకపోడం, స్పందించకపోవడంవల్ల ప్రభుత్వ పథకాల అమల్లో జిల్లా యంత్రాంగానికి తీవ్ర ఇబ్బందులు ఎదురైన నేపథ్యంలో సెలవులో ఉన్న గుర్రంపోడు తహసీల్దార్ కిరణ్‌కుమార్‌ను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు..
మఠంపల్లి: సూర్యాపేట జిల్లా మఠంపల్లి ఎంపీడీవో, ఎంపీవోతో పాటు కిందితండా గ్రామపంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే వ్యవహరంలో అత్యుత్సాహం చూపిన ముగ్గురు కార్యదర్శులను డీపీవో ఆఫీ్‌సకు అటాచ్ చేశారు. మఠంపల్లి మండలంలోని కిందితండా గ్రామంలో ఓటర్ల జాబితలో అధికారులు వార్డులను సక్రమంగా ఎంపిక చేయలేదని, చెన్నాయిపాలెం పంచాయతీకి సంబంధించిన 40ఓట్లను కింది తండాలో చేర్చారని తండాకు చెందిన భూక్య బాబురావునాయక్‌తో పాటు స్థానిక నేతలు గత సంవత్సరం నవంబరు 28న ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎన్నికల కమిషన్ కిందితండా ఓటర్ల జాబితాను పరిశీలించాలని మం డలస్థాయి అధికారులను ఆదేశాలు జారీచేశారు. దీంతో ఎంపీడీవో కొంతమంది కార్యదర్శులతో నామమంత్రంగా విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. రాజకీయ నాయకుల ఒత్తిడికి, అధికారుల నిర్లక్ష్యం చేసి తప్పుడు నివేదిక ఇచ్చారని రెండోసారి స్థానిక నేతలు గత సంవత్సరం డిసెంబరు 13న ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఎన్నికల అధికారులు మరోమారు విచారణకు డీఎల్‌పీవో ఆధ్వర్యంలో ఎంపీడీవో బానాల శ్రీనివాస్, ఎంపీవో నరేష్, పంచాయతీ కార్యదర్శి బాలసైదులుతో పాటు మరో 10మంది కార్యదర్శులతో కిందితండాలో విచారణ చేపట్టారు. ఓటర్ల జాబితా సక్రమంగానే ఉందని ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేయకుండా తప్పుడు నివేదిక ఇచ్చారని, ఓటర్ల జాబితా లో అవకతవకలు జరిగాయని, పూర్తిస్థాయి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని జనవరి 6, ఫిబ్రవరి 8న రెండోసారి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ క్షేత్రస్థాయిలో వాస్తవ అవాస్తవాలను తెలుసుకొని అధికారులు విచారణలో పంపిన తుది ఓటర్ల జాబితాను పరిశీలించగా అవకతవకలు జరిగాయని గుర్తించి అందుకు బాధ్యులైన ఎంపీడీవో, ఎంపీవో, పంచాయతీ కార్యదర్శితో పాటు విచారణలో సహకరించిన మరో ముగ్గురు పంచాయతీ కార్యదర్శులు ఇదే మండలంలో పనిచేస్తున్న ప్రవీణ్, రాజా, విజయలక్ష్మీలను డీపీవో ఆఫీ్‌సకు అటాచ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయమై జిల్లాపంచాయతీ అధికారి నారాయణరెడ్డి మాట్లాడుతూ మ ఠంపల్లి మండలం కిందితండా గ్రామంలో ఓటర్ల జాబితా ఫైనల్‌లో డ్రాప్టింగ్ విషయంలో మిస్‌మ్యాచ్ చేశారని గుర్తించి అందుకు బాధ్యులైన వారిని జిల్లా ఆదేశాల మేరకు ఎంపీడీవో, ఎంపీవో, కిందితండా పంచాయతీ కార్యదర్శిని సప్పెండ్ చేశారని, వీరితో పాటు మరో ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను డీపీవో కార్యాలయానికి అటాచ్ చేశారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
విధుల పట్ల నిర్లక్ష్యం.. కార్యదర్శిపై వేటు
భువనగిరి (కలెక్టరేట్): విధుల్లో నిర్లక్ష్యం వహించిన బొమ్మలరామారం గ్రామపంచాయితీ కార్యదర్శి కే. పద్మజను యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్ ఎం. హనుమంతరావు సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 20న బొమ్మలరామారం మండలాన్ని ఆకస్మికంగా సందర్శి ంచిన కలెక్టర్ గ్రామపంచాయితీ తనిఖీ సందర్భంలో పంచాయతీ కార్యదర్శి విధులకు హాజరు కాలేదు. విచారణ చేసిన అధికారులు కలెక్టర్‌కు నివేదిక పంపారు. కార్యదర్శి పద్మజగ్రేడ్-4 ఫిబ్రవరి 20న ఉదయం 11:13 నిమిషాలకు కార్యాలయానికి హాజరయ్యాని, డీఎస్‌ఆర్‌ను బిల్‌కలెక్టర్ ద్వారా అప్‌లోడ్ చే యించినట్లు తేలింది. ఇంటి యజమానులకు డిమాండ్ నోటీసులు ఇవ్వక పోవడం, ఆన్‌లైన్‌లో తప్పుడు పన్ను రసీదులు అప్‌లోడ్, సానిటేషన్ నిర్వహ ణలో నిర్లక్ష్యం, రికార్డుల నిర్వహణ సరిగ్గాలేదని తేలడంతో సస్పెండ్ చేశారు.