Aadi Srinivas: బాంబు పెట్టారనడానికి సిగ్గు లేదా..?
ABN , Publish Date - Aug 18 , 2025 | 04:39 AM
‘కాళేశ్వరం కట్టింది.. అది కూలిందీ బీఆర్‌ఎస్ హయాంలోనే కదా..! కాంగ్రెస్ పార్టీ వాళ్లు బాంబు పెట్టారని, కుట్ర చేశారని సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నారు
హరీశ్‌రావుపై ఆది శ్రీనివాస్ ఆగ్రహం
హైదరాబాద్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ‘కాళేశ్వరం కట్టింది.. అది కూలిందీ బీఆర్‌ఎస్ హయాంలోనే కదా..! కాంగ్రెస్ పార్టీ వాళ్లు బాంబు పెట్టారని, కుట్ర చేశారని సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నారు?’ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ అవినీతి, అక్రమాల వల్ల కూలిన కాళేశ్వరం.. ఇప్పుడు తెలంగాణకు గుదిబండలాగా మారిందన్నారు. ఆనాడే తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ కట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసి.. ఆ బ్యారేజ్ కొట్టుకుపోతే రేవంత్ ప్రభుత్వానికి చెడ్డపేరు రావాలని హరీశ్ చూస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఆయన బురద రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు.