Municipalities: పంచాయతీల్లో రద్దు.. మునిసిపాలిటీల్లో మంజూరు
ABN , Publish Date - Aug 31 , 2025 | 04:30 AM
కొత్తగా ఏర్పడిన మునిసిపాలిటీల్లో 165 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. అంతకు ముందు ఈ పోస్టులు మునిసిపాలిటీల్లో విలీనమైన పంచాయతీల్లో ఉండేవి. విలీనం నేపథ్యంలో వీటి అవసరం లేదని ప్రభుత్వం గుర్తించింది.
పట్టణ స్థానిక సంస్థల్లో కొత్తగా 165 పోస్టుల సృష్టి
హైదరాబాద్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): కొత్తగా ఏర్పడిన మునిసిపాలిటీల్లో 165 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. అంతకు ముందు ఈ పోస్టులు మునిసిపాలిటీల్లో విలీనమైన పంచాయతీల్లో ఉండేవి. విలీనం నేపథ్యంలో వీటి అవసరం లేదని ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శితోపాటు జూనియర్ అసిస్టెంట్ వంటి వి కలిపి 6,884 పోస్టులు ఉండగా వీటిలో 165 పోస్టులను తగ్గించి 6,719 పోస్టులు చేశారు. ఇక పట్టణ స్థానిక సంస్థల్లో (మునిసిపాలిటీ) 38 మేనేజర్/రెవెన్యూ ఆఫీసర్ కేటగిరీ-3తోపాటు 17 జూనియర్ అసిస్టెంట్, 37 జూనియర్ అసిస్టెంట్, 55 వరకు వార్డు ఆఫీసర్/బిల్ కలెక్టర్, 3 అటెండర్/ఆఫీస్ సబార్డినేట్, 4 కామాటి, 1 ఫిట్టర్, 8 స్వీపర్, ఒకటిచొప్పున పంప్ ఆపరేటర్, వాచ్‌మెన్ పోస్టులు కలిపి మొత్తం 165 పోస్టులను కొత్తగా సృష్టించారు. దీంతో మునిసిపాలిటీల్లో పోస్టుల సంఖ్య 2,119కు చేరింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా శనివారం జీవో జారీ చేశారు.