Energy Efficiency: భూతాపాన్ని తగ్గించేందుకు త్రిముఖ వ్యూహం
ABN , Publish Date - Jul 12 , 2025 | 04:46 AM
పెరుగుతున్న భూతాపాన్ని త గ్గించేందుకు దేశ ప్రధాని పిలుపుమేరకు త్రిముఖ వ్యూహంతో ముందుకు సాగాలని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపునిచ్చారు.
2047నాటికి పచ్చదనాన్ని 50 శాతానికి పెంచాలి
పునరుత్పాదక ఇంధనంపై సమీక్షలో గవర్నర్ జిష్ణుదేవ్
హైదరాబాద్, జూలై 11(ఆంధ్రజ్యోతి): పెరుగుతున్న భూతాపాన్ని త గ్గించేందుకు దేశ ప్రధాని పిలుపుమేరకు త్రిముఖ వ్యూహంతో ముందుకు సాగాలని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపునిచ్చారు. 2047 నాటికి తెలంగాణలో పచ్చదనాన్ని 50శాతానికి పెంచాలనే లక్ష్యంతో మొక్కలు నాటే కార్యక్రమాలను ముమ్మరం చేయాలని, ఇంధన పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషీయన్సీ(బీఈఈ) దక్షిణ భారత మీడియా సలహదారు ఏ.చంద్రశేఖర్‌రెడ్డి, ఎనర్జీ ఎఫిషీయన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎ్‌సఎల్) అధికారులు శుక్రవారం గవర్నర్‌ను కలిసి ఇంధన సామర్థ్య రంగంలో కీలక పరిణామాలను వివరించారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ గ్రీన్‌హౌ్‌స వాయు ఉద్గారాలను తగ్గించడానికి ప్రభుత్వాలతోపాటు ప్రజలు దృష్టి సారించాలని కోరారు. వాతావరణ మార్పుల వల్లే కలిగే ప్రభావాలను తగ్గించేందుకు ఇంధ న సామర్థ్యమే ఎక్కువగా దోహదపడుతుందన్నారు. సౌర విద్యుత్ తయారీలో మహిళలకు భాగస్వామ్యం కల్పించిన తెలంగాణ ప్రభుత్వ చొరవను ఆయన అభినందించారు. ఇళ్లల్లో వినియోగించే 16 ఉపకరణాలు తక్కువ విద్యుత్‌ను వినియోగించుకునేవై ఉండాలని, వీటిలో ఏసీలు, ఫ్యాన్లు, రిఫ్రజిరేటర్లు సహా ఇతర పరికరాలు ఉన్నాయని బీఈఈ దక్షిణ భారత మీడియా సలహదారు చంద్ర శేఖర్ రెడ్డి తెలిపారు. దీనిపై స్పందించిన గవర్నర్ ఈఈఎ్‌సఎల్ ద్వారా రాజ్‌భవన్, జేఎన్‌టీయూలో ఆడిట్ నిర్వహించి.. ఇంధన సమర్ధవంతమైన క్యాంప్‌సలుగా మార్చడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. ఈమేరకు ఈఈఎ్‌సఎల్ సీనియర్ అధికారి ఆదేశ్ సక్సేనా పదిహేను రోజుల్లో రాజ్‌భవన్‌లో ఇంధన ఆడిట్ నిర్వహిస్తామని గవర్నర్‌కు హమీ ఇచ్చారు.