Share News

Know Your Army: ‘ఆర్మీ మేళా’ను ప్రారంభించిన గవర్నర్‌

ABN , Publish Date - Jan 04 , 2025 | 05:21 AM

చారిత్రాత్మక గోల్కొండ కోటలో ‘నో యువర్‌ ఆర్మీ మేళా’ ప్రారంభమైంది. శుక్రవారం రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, మేజర్‌ జనరల్‌ అజయ్‌ మిశ్రాతో కలిసి ఈ మేళాను ప్రారంభించారు.

Know Your Army: ‘ఆర్మీ మేళా’ను ప్రారంభించిన గవర్నర్‌

అల్వాల్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): చారిత్రాత్మక గోల్కొండ కోటలో ‘నో యువర్‌ ఆర్మీ మేళా’ ప్రారంభమైంది. శుక్రవారం రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, మేజర్‌ జనరల్‌ అజయ్‌ మిశ్రాతో కలిసి ఈ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత సైన్యం ఉపయోగించే అఽత్యాధునిక ఆయుధ పరికరాలతో పాటు వివిధ రకాల ఆవిష్కరణలను ప్రదర్శించారు. పంజాబ్‌ రెజిమెంట్‌లోని సైనికులు గట్కాతో ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చారు. ఆర్టిలరీ సెంటర్‌లోని సైనికులు నిరాయుధ పోరాట యుద్ధ కళలను ప్రదర్శించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5వరకు నిర్వహిస్తున్న ఈ మేళా ఆదివారం వరకు కొనసాగనుంది.

Updated Date - Jan 04 , 2025 | 05:21 AM