Share News

గవర్నర్‌, సీఎం బక్రీద్‌ శుభాకాంక్షలు

ABN , Publish Date - Jun 07 , 2025 | 04:07 AM

బక్రీద్‌ పండుగ సందర్భంగా ప్రజలకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో శుభాకాంక్షలు తెలిపారు.

గవర్నర్‌, సీఎం బక్రీద్‌ శుభాకాంక్షలు

హైదరాబాద్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): బక్రీద్‌ పండుగ సందర్భంగా ప్రజలకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్‌ త్యాగానికి ప్రతీక అని, భాగస్వామ్యం, దానధర్మం, గౌరవం, అవసరమైన వారికి సాయం చేయడం ఈ పండుగ ఉద్దేశాలని గవర్నర్‌ పేర్కొన్నారు. దైవభక్తి, త్యాగ నిరతికి బక్రీద్‌ అద్దం పడుతుందని.. దాతృత్వాన్ని మించి మరొకటి లేదనే స్ఫూర్తిని ఈ పండుగ చాటిచెబుతోందని సీఎం పేర్కొన్నారు. ఇటు టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ కూడా బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Jun 07 , 2025 | 04:07 AM