Share News

Ramarajyam Controversy: దాడులను సహించం: మంత్రి శ్రీధర్‌ బాబు

ABN , Publish Date - Feb 12 , 2025 | 05:51 AM

రామరాజ్యం పేరిట జరిగే దాడులను ప్రభుత్వం సహించదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు హెచ్చరించారు. చిలుకూరుకు మంగళవారం వచ్చిన ఆయన ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్‌ రంగరాజన్‌ను పరామర్శించారు.

Ramarajyam Controversy: దాడులను సహించం: మంత్రి శ్రీధర్‌ బాబు

చిలుకూరు ప్రధానార్చకులు రంగరాజన్‌కు పరామర్శ

హైదరాబాద్‌, మొయినాబాద్‌ రూరల్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి) : రామరాజ్యం పేరిట జరిగే దాడులను ప్రభుత్వం సహించదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు హెచ్చరించారు. చిలుకూరుకు మంగళవారం వచ్చిన ఆయన ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్‌ రంగరాజన్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిందితుల్లో కొందరిని పోలీసులు అరెస్టు చేశారని, చిలుకూరు బాలాజీ ఆలయం వద్ద భద్రతను పెంచాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గంగు ఉపేంద్రశర్మ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, వివిధ బ్రాహ్మణ సంఘాల నాయకులు రంగరాజన్‌ను పరామర్శించారు. కాగా, రామరాజ్యం ముసుగులో రంగరాజన్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ తెలిపారు. మంగళవారం ఆయన రంగరాజన్‌ను పరామర్శించారు. దాడికి పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Feb 12 , 2025 | 05:51 AM