Share News

ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీకి ఇదే ఆఖరి చాన్స్‌!

ABN , Publish Date - Jun 22 , 2025 | 04:38 AM

ఎల్‌ఆర్‌ఎస్‌ 25 శాతం రాయితీ పథకాన్ని ఈ నెలాఖరుతో నిలిపేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. జూలై నుంచి ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులు రాయితీ లేకుండానే ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.

ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీకి ఇదే ఆఖరి చాన్స్‌!

  • జూలై నుంచి ఆపేయాలని సర్కారు నిర్ణయం?

హైదరాబాద్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): ఎల్‌ఆర్‌ఎస్‌ 25 శాతం రాయితీ పథకాన్ని ఈ నెలాఖరుతో నిలిపేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. జూలై నుంచి ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులు రాయితీ లేకుండానే ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న రోజు ఉన్న మార్కెట్‌ విలువలో 25 శాతం రాయితీ ఇస్తున్నారు.. జూలై నుంచి ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారమే ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజును లెక్కిస్తారని పురపాలక శాఖ అధికారులు చెబుతున్నారు.


రాష్ట్రవ్యాప్తంగా 20,11,712 మందికి ఫీజు కట్టాలని లేఖలు పంపగా.. వారిలో 6,26,295 మంది మాత్రమే ఇప్పటి వరకు ఫీజు చెల్లించారు. ఇంకా 13,85,417 మంది దరఖాస్తుదారులు ఫీజు చెల్లించాల్సి ఉంది. ఫీజు చెల్లించాలని లేఖలు పంపిన వారిలో 31.14 శాతం మంది రాయితీ పథకాన్ని వినియోగించుకున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ఇచ్చిన నివేదికలో పురపాలక శాఖ అధికారులు పేర్కొన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీ పథకం కింద ఇప్పటి వరకు రూ.2075 కోట్ల ఆదాయం వచ్చింది.

Updated Date - Jun 22 , 2025 | 04:39 AM