రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
ABN , Publish Date - Feb 01 , 2025 | 11:24 PM
రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అచ్చంపేట ఎ మ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు.
- స్ర్పింక్లర్ల పంపిణీలో ఎమ్మెల్యే వంశీకృష్ణ
అచ్చంపేట/ అచ్చంపేటటౌన్/ చారకొండ, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి) : రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అచ్చంపేట ఎ మ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. మం డల కేంద్రంలోని రైతువేదికలో ఉద్యాన, పట్టుప రిశ్రమశాఖ ఆధ్వర్యంలో శనివారం రైతులకు 75 శాతం సబ్సిడీతో మండలంలోని వివిధ గ్రామా లకు చెందిన 94 మంది రైతులకు స్ర్ల్పింకర్ల యూనిట్‌లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ప్రతీ రైతుకు రైతుభరోసా అందిస్తామని తెలిపారు. కల్వకుర్తి డివిజన్ హార్టికల్చర్ అధికారి మహే శ్వరి, ఏఈవో వంశీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండె వెంకటయ్యగౌడ్, కాంగ్రెస్ మండల అధ్య క్షుడు జమ్మికింది బాలరాంగౌడ్, మండల వర్కిం గ్ ప్రసిడెంట్ పానుగంటి అంజయ్య, డీసీసీ ప్రధాన కార్యదర్శి మహేందర్, పీఏసీఎస్ డైరెక్టర్ జగన్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జైపాల్, మండల యూత్ ప్రసిడెంట్ గణేష్ గౌ డ్. ఎన్‌ఎస్‌యూఐ, ఎస్టీసెల్, మైనార్టీ మండల అధ్యక్షుడు గోరెటి శివ, రవిరాథోడ్, సత్తార్, నా యకులు శంకర్‌గౌడ్, వెంకటయ్యగౌడ్, నర్సింహా రెడ్డి, సురేందర్‌రెడ్డి, సహదేవ్ పాల్గొన్నారు.
సీవీకే కప్ విన్నర్‌గా మన్నెవారిపల్లి టీం
క్రీడల్లో గెలుపోటము లను సమానంగా తీసుకో వాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. జనవరి 24 నుంచి ప్రారం భమైన సీవీకే ఆల్ ఇండి యా క్రికెట్ టోర్నమెంట్ శనివారం ముగిసింది. శనివారం చివరి రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మాన్నెవారిపల్లి టీం, కర్ణాటక బళ్లారి టీంలు తలబడ్డాయి. బళ్లారి టీంపై మన్నెవారిపల్లి టీం విజయం సాధిచింది. మ్యాచ్ విజేతగా నిలిచిన మన్నెవారిపల్లి టీంకు మొదటి బహుమతి ట్రోఫీతో పాటు రూ.5 లక్షల ప్రైజ్‌మనీని ఆయన అందజేశారు. రన్నర్‌గా నిలిచిన బళ్లారి టింకు రూ.3 లక్షల ప్రైజ్‌మనినీ క్రీడాకారులకు అందజే శారు. ఈ టోర్నమెంటు నిర్వహణకు సహకరించిన అనూష ప్రాజెక్టు ప్రైవేటు లిమి టెడ్ అధినేత జలంధర్‌రెడ్డితో పాటు నిర్వాహ కులు, మేనేజ్మెంట్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ఫ అచ్చంపేటలోని జూనియర్ బాలికల కళాశాలలో సీబీఎం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యం లో అన్నదాన కార్యక్రమం ఆయన ప్రారంభిం చారు. విద్యార్థులు భయంలేకుండా పోటీ పరీక్ష ల్లో ఉతమ ఫలితాలు సాధించాలని ఎమ్మెల్యే అన్నారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, మునిసిపల్ చైర్మన్ శ్రీనివాసులు, సీబీఎం చారి టబుల్ ట్రస్టు సభ్యులు, కళాశాల లెక్చరర్లు, విద్యార్థులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.