Employees: సమస్యలపై 2న చర్చిద్దాం.. రండి!
ABN , Publish Date - Aug 29 , 2025 | 04:15 AM
ఉద్యోగుల ఉద్యమ కార్యాచరణపై ప్రభుత్వం స్పందించిందని జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస్‌రావు తెలిపారు.
ఉద్యోగుల జేఏసీకి సర్కారు పిలుపు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సమావేశమైన జేఏసీ నేతలు
చర్చల తర్వాత ప్రభుత్వ స్పందనను బట్టి తమ కార్యాచరణ ఉంటుందని వెల్లడి
హైదరాబాద్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల ఉద్యమ కార్యాచరణపై ప్రభుత్వం స్పందించిందని జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస్‌రావు తెలిపారు. ఉద్యోగుల డిమాండ్లపై చర్చించేందుకు సెప్టెంబరు 2న రావాలంటూ ప్రభుత్వం ఆహ్వానం పంపిందని చెప్పారు. గురువారం ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్కతో భేటీ అనంతరం ఈ మేరకు వెల్లడించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సెప్టెంబరు 2న ప్రభుత్వం స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆ చర్చల తర్వాత ప్రభుత్వం చేసే ప్రకటనను అనుసరించి, తదుపరి కార్యాచరణ వెల్లడిస్తామని జేఏసీ నేతలు తెలిపారు.