Share News

వైద్య కాలేజీల్లో వసతుల కల్పనపై10 కమిటీలు

ABN , Publish Date - Jun 24 , 2025 | 04:11 AM

వైద్య కళాశాలల్లో తనిఖీలు, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం మెడికల్‌ కాలేజీ మానిటరింగ్‌ కమిటీలు వేసింది.

వైద్య కాలేజీల్లో వసతుల కల్పనపై10 కమిటీలు

వైద్య కళాశాలల్లో తనిఖీలు, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం మెడికల్‌ కాలేజీ మానిటరింగ్‌ కమిటీలు వేసింది. ఇందులో భాగంగా వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించే బాధ్యతను జిల్లా కలెక్టర్లపై ఉంది. ఇందులో భాగంగా మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వైద్యఆరోగ్యశాఖ వీడియో కాన్ఫెరెన్స్‌ నిర్వహించబోతోంది.


వైద్యమంత్రి దామోదర రాజనర్సింహా, సీఎస్‌ రామకృష్టారావు, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఈ వీడియో కాన్ఫెరెన్స్‌లో పాల్గొంటారని ఆ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. మెడికల్‌ కాలేజీల్లో తనిఖీలపై పది కమిటీలను వేసింది. ఆ కమిటీల్లో జిల్లా కలెక్టర్లను భాగస్వామ్యులను చేసింది.

Updated Date - Jun 24 , 2025 | 04:11 AM