Share News

చేతి రాతతో మంచి మార్కులు

ABN , Publish Date - Feb 03 , 2025 | 12:14 AM

పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 21 నుం చి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ఫ్రీ పైనల్‌ పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యార్థు లు రాత్రింబవుళ్లు పుస్తకాలతో కుస్తీ పడుతున్నా రు.

 చేతి రాతతో మంచి మార్కులు

చేతి రాతతో మంచి మార్కులు

రైటింగ్‌ బాగుంటే మనవెంటే మార్కులు

అందమైన రాతతో అధిక మార్కులు

ప్రాక్టీ్‌సతోనే అందమైన చేతిరాత

పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 21 నుం చి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ఫ్రీ పైనల్‌ పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యార్థు లు రాత్రింబవుళ్లు పుస్తకాలతో కుస్తీ పడుతున్నా రు. ఎంత చదివామన్నది ఎంత ముఖ్యమో ఎలా రాశామన్నది కూడా అంతే ముఖ్యం. అయితే పరీక్షల్లో మంచి మార్కులు సాధించడానికి మన చేతిరాత ఎలా ఉందనేది కూడా ఆలోచించుకోవాలి. చేతి రాతను బట్టి ఎక్కువ మార్కులు పొందవచ్చని రాత విశ్లేషకులు చెబుతున్నారు.

- (ఆంధ్రజ్యోతి, కనగల్‌)

రాళ్లపైన అక్షరాలు చెక్కిన రాతియుగం నుం చి పేపర్‌పై పెన్నుతో అక్షరాలు రాసే నేటి కం ప్యూటర్‌ యుగం దాకా చేతిరాత ఎన్నో మలుపు లు తిరుగుతూ వస్తోంది. ప్రపంచంలో ఏ ఇద్దరి చేతిరాత ఒకేతీరుగా ఉండదు. రాయడంలో ఎవ రి శైలి వారిది. అక్షరాలను ముత్యాల్లా రేసేవారు కొందరైతే మరికొందరు కొంగలు తొక్కిన రీతిలో గజిబిజిగా రాస్తారు. నా రాత నా ఇష్టం అనుకోకుండా చక్కటి రాతతో మంచి మార్కులు సా ధించాలి. అందమైన రాత ఉంటే మంచి భవిష్యత్తును పొందుతారు. రాతను బట్టి వ్యక్తి గుణగణాలను అంచనా వేయవచ్చని గ్రాఫాలజిస్టుల అభిప్రాయం. చిన్నవయస్సు నుండే అక్షరాలను గుండ్రంగా రాయడం ప్రాక్టీస్‌ చేయాలి. బ్రహ్మ రాసిన నుదుటి రాతను చేతిరాత ద్వారా కొంతవరకైన మార్చుకోవచ్చు. పరీక్షల్లో అందమైన చేతిరాతతో జవాబులు రాస్తే 10 నుంచి 15 శాతం మార్కులు అదనంగా స్కోర్‌ చేయవచ్చు.

మార్చి నెలలో వార్షిక పరీక్షలు జరగనున్న నేపథ్యంలో మండలంలోని చినమాదారం గ్రామ హైస్కూల్‌లో ఉపాధ్యాయులు విద్యార్థుల చేతిరాతను మెరుగుపరచడానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. పదోతరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న స్పెషల్‌ క్లాసుల్లో విద్యార్థులతో రాత ప్రాక్టీస్‌ చేయిస్తున్నారు. ప్రతీ రోజు క్రమం తప్పకుండా కొంత సమయాన్ని చేతిరాత కోసం కేటాయుస్తున్నారు. అవసరమైన మెళకువలను అందజేస్తున్నారు. పరీక్షల్లో జవాబులు ఎలా రాయాలి అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు.

రాసేటప్పుడు ఇవి గుర్తుంచుకోవాలి

పెన్ను కానీ, పెన్సిల్‌ కానీ పట్టుకునే విధానం తగిన విధంగా ఉండాలి.

పదాలు, వాక్యాలు, పేరాల మధ్య తగిన స్థలం వదలాలి.

అక్షరాల సైజు ఒకే తీరుగా ఉండాలి.

భాష దోషాలు లేకుండా చూడాలి.

గొలుసుకట్టు రాత రాయకూడదు.

చేతిరాత వేగంగా రాసేలా ప్రాక్టీస్‌ చేయాలి.

ప్రారంభం నుంచి చివరి లైనదాకా అం దంగా ఉండేటట్టు తగిన ఓపికతో రాయాలి.

పరీక్షలు రాసేటప్పుడు ఇవి పాటించండి

పరీక్షలో జవాబు పత్రాలు ఇవ్వగానే స్కేల్‌ సహాయంతో తగిన మార్జిన కొట్టాలి

జవాబు పత్రంపై మరీ ఎక్కువ లైనులు కాకుండా మరీ తక్కువ కాకుండా పేజీకి 16నుంచి 18లైన్లకు మించకుండా రాయాలి.

ఆన్సర్‌షీట్‌పై ప్రతి వాక్యం స్రైట్‌గా ఉండేటట్లు రాయాలి. 8 ముఖ్యమైన అంశాలు కింద గీత ఉండేట ట్లు చూడాలి

విరామ చిహ్నాలు పాటిస్తూ రాయాలి.

తెలుగులో అయితే అక్షరాలు గుండ్రంగా ఉండేటట్లు రాయాలి.

తెలుగులో తలకట్టు, దీర్ఘాలు, ఒత్తులు స్పష్టంగా కనబడేటట్టు అక్షరాల తలలపై ఉండాలి స్పెల్లింగ్‌ మిస్టేక్స్‌ లేకుండా చూడాలి.

పెద్ద, చిన్న అక్షరాల వ్యత్యాసం గమనిస్తూ రాయాలి. 8 పరీక్షల్లో ఎట్టి పరిస్థితిల్లోనూ రెడ్‌ పెన్ను వాడకూడదు. బ్లూ లేదా బ్లాక్‌ పెన మాత్రమే వాడాలి.

చక్కటి చేతిరాతతో ఎక్కువ మార్కులు

పరీక్షల్లోనే కాదు భవిష్కత్తులో ఎక్కడైనా, ఎప్పుడైనా చక్కటి చేతిరాత ఎంతో అవసరం. శాస్త్ర సాకేతికత పెరిగినా చేతిరాతకు ఏ మాత్రం ప్రాధా న్యం తగ్గలేదు. విద్యార్థులకు మంచి రైటింగ్‌ ఉం టే ఎక్కువ మార్కులు సాధించి మంచి గ్రేడ్‌ను సాధిస్తారు. మారిన పరీక్ష విధానం ప్రకారం ఈ ఏడాది పదో తరగతి వార్షిక పరీక్షల్లో సింగిల్‌ పేపర్‌ విధానంలో 11 పేపర్లకు గాను 7 పేపర్లు ఉంటాయి. ప్రతి విద్యార్ది రాతపై తగు శ్రద్దపెట్టి ప్రాక్టీస్‌ చేయాలి. ఉపాద్యాయుల సూచనలు పా టిస్తూ పరీక్షలు రాసి మంచి ఫలితాలు పొందవచ్చును.

- కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, ఉపాధ్యాయుడు, చినమాదారం హైస్కూల్‌ టీచర్‌, చేతిరాత నిపుణుడు

Updated Date - Feb 03 , 2025 | 12:14 AM