Share News

Goa Trip Blackmail: గోవాకు వెళ్లే ప్రేమ జంటలకు అలర్ట్.. వెలుగులోకి బ్లాక్‌మెయిల్ దందా..

ABN , Publish Date - Dec 07 , 2025 | 11:35 AM

గోవాకు చెందిన ఓ హోటల్ యజమాని బ్లాక్ మెయిల్ స్కామ్‌కు తెరతీశాడు. తన హోటల్‌లో దిగిన ప్రేమ జంటల వీడియోలు తీసి బెదిరింపులకు దిగాడు. ఎర్రగడ్డకు చెందిన ఓ మహిళను కూడా వేధింపులకు గురి చేశాడు. 30 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు.

Goa Trip Blackmail: గోవాకు వెళ్లే ప్రేమ జంటలకు అలర్ట్.. వెలుగులోకి బ్లాక్‌మెయిల్ దందా..
Goa Trip Blackmail

తన హోటల్‌లో దిగిన ప్రేమ జంటలపై హోటల్ యజమాని కుట్రలకు తెరతీశాడు. ప్రేమ జంటల ప్రైవేట్ వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయటం మొదలెట్టాడు. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్ చేశాడు. మరొకరితో పెళ్లయిందని, వదిలేయమని వేడుకున్నా వినకుండా బెదిరింపులకు గురిచేశాడు. ఈ సంఘటనకు సంబంధించి సనత్ నగర్ పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎర్రగడ్డకు చెందిన 35 ఏళ్ల ఓ మహిళ 2023లో తన ప్రియుడితో కలిసి గోవాకు వెళ్లింది. ఆ ప్రేమ జంట యశ్వంత్‌ అనే వ్యక్తికి చెందిన హోటల్‌లో దిగింది.


యశ్వంత్ వారు ఏకాంతంగా గడిపిన దృశ్యాలను సీక్రెట్ కెమెరా ద్వారా వీడియోలు తీశాడు. రెండేళ్లు గడిచిపోయాయి. అనుకోని కారణాల వల్ల ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లయింది. ఇలాంటి సమయంలో యశ్వంత్ మహిళకు ఫోన్ చేశాడు. పాత వీడియోలు బయటపెడతానంటూ బెదిరింపులకు దిగాడు. 30 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేశాడు. తనకు వేరే వ్యక్తితో పెళ్లయిందని ఆమె చెప్పింది. తన వైవాహిక జీవితం చెడిపోతుందని, వదిలేయమని వేడుకుంది.


యశ్వంత్ ఆమె మాటల్ని పట్టించుకోలేదు. వేధింపులు మరింత పెంచాడు. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. మహిళ ఫిర్యాదు మేరకు సనత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యశ్వంత్‌ను పట్టుకోవడానికి గోవాకు వెళ్లారు. గోవాకు వెళ్లే ప్రేమ జంటలను పోలీసులు హెచ్చరిస్తున్నారు. హోటళ్లలో చాలా జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. ఇక, ఈ మధ్యకాలంలో ఇలాంటి సంఘటనలు బాగా పెరిగిపోయాయి. ఎంతో మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.


ఇవి కూడా చదవండి

సిరీస్ మొత్తంలో గర్వపడింది అప్పుడే: కేఎల్ రాహుల్

విశాఖపట్నంలో ఘోరం.. మహిళ దారుణ హత్య

Updated Date - Dec 07 , 2025 | 11:38 AM