Share News

బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి

ABN , Publish Date - Jan 31 , 2025 | 11:48 PM

బాలికల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొ ని చదువుతోపాటు అన్ని రంగాలలో రాణించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి అర్పిత మారంరెడ్డి అన్నారు. శుక్రవారం బేటీ బచావో-బేటీ పడావో దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా జిల్లా మ హిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన అవగా హన సదస్సుకు హాజరయ్యారు.

బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి
మాట్లాడుతున్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి అర్పిత మారంరెడ్డి

- జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి అర్పిత మారంరెడ్డి

మంచిర్యాల క్రైం, జనవరి 31(ఆంధ్రజ్యోతి) : బాలికల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొ ని చదువుతోపాటు అన్ని రంగాలలో రాణించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి అర్పిత మారంరెడ్డి అన్నారు. శుక్రవారం బేటీ బచావో-బేటీ పడావో దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా జిల్లా మ హిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన అవగా హన సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ బాలికలు అన్ని రంగాల్లో ముందుండాలని, చదువులపై ప్రత్యేక శ్రద్ధ కలిగి, ఉత్తమ లక్ష్యాన్ని ఎంచుకుని లక్ష్యసాధన దిశగా అడుగు లు వేయాలని సూచించారు. బాలికలు, మహిళల సంక్షేమం కోసం న్యాయవ్యవస్థ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. ఏదైనా సలహా కోసం డీఎల్‌ఎస్‌ఎ ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 15100లో సంప్రదించాలని తెలిపారు. ప్రభుత్వం జిల్లా మహిళా, సంక్షేమ శాఖ ద్వారా అనేక కార్యక్రమాలు చేపడతామని, ఆపత్కర పరిస్థితిల్లో బాలికలు చైల్డ్‌ హెల్స్‌ లైన్‌ నెంబర్‌ 1098ను సంప్రదిం చాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం జిల్లా సమన్వయకర్త సౌజన్య, డిస్ట్రిక్ట్‌ చీఫ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌ మహమ్మద్‌ సందాని, మహిళా సాధికారత కేంద్రం, ఆర్థి క అక్షరాస్యత నిపుణురాలు లిప్సిక, పాఠశాల ప్రిన్సిపల్‌, అధ్యాపకు లు, విద్యార్థినులు పాల్గొన్నారు.

Updated Date - Jan 31 , 2025 | 11:48 PM