Allu Aravind: అల్లు అరవింద్‌కు జీహెచ్‌ఎంసీ నోటీసు
ABN , Publish Date - Sep 09 , 2025 | 04:46 AM
బంజారాహిల్స్, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్‌కు జీహెచ్‌ఎంసీ సోమవారం నోటీసు జారీ చేసింది.
అనుమతి లేకుండా పెంట్‌హౌస్ కట్టారని తాఖీదు
హైదరాబాద్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): బంజారాహిల్స్, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్‌కు జీహెచ్‌ఎంసీ సోమవారం నోటీసు జారీ చేసింది. జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 45లో ఆయన అల్లు బిజినెస్ పార్క్ పేరిట సుమారు వెయ్యి గజాల్లో భవనం నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు నాలుగు అంతస్థుల వరకు జీహెచ్‌ఎంసీ అనుమతులు తీసుకున్నారు. ఏడాది క్రితమే ఆ ఇంటి నిర్మాణం పూర్తి చేశారు. అయితే, ఇటీవల అదనంగా పెంట్‌హౌస్ నిర్మించారు. దీంతో అక్రమంగా నిర్మించిన పెంట్‌హౌ్‌సను ఎందుకు కూల్చవద్దంటూ జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీ చేశారు.