Share News

GHMC: లక్డీకాపూల్‌లో రోశయ్య కాంస్య విగ్రహం

ABN , Publish Date - May 14 , 2025 | 04:18 AM

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కాంస్య విగ్రహం లక్డీకాపూల్‌లో ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. జూలై 4న రోశయ్య జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు.

GHMC: లక్డీకాపూల్‌లో రోశయ్య కాంస్య విగ్రహం

  • ఏర్పాటుకు జీహెచ్‌ఎంసీ నిర్ణయం

హైదరాబాద్‌ సిటీ, మే 13 (ఆంధ్రజ్యోతి) : మాజీ ముఖ్యమంత్రి, దివంగత కొణిజేటి రోశయ్య కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. లక్డీకాపూల్‌లోని మెట్రో స్టేషన్‌ సమీపంలోని చౌరస్తాలో తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు కోసం బిడ్‌లు ఆహ్వానిస్తూ మంగళవారం టెండర్‌ నోటిఫికేషన్‌ ప్రకటించారు. 450కిలోల బరువైన విగ్రహం, దాన్ని ఏర్పాటు చేసేందుకు పీఠం, విగ్రహం తరలింపు, నిర్ణీత ప్రాంతంలో క్రేన్‌ ద్వారా ఏర్పాటు వంటివి ఎంపికైన ఏజెన్సీ చేయాల్సి ఉంటుంది. విగ్రహంలో ఏ మెటీరియల్‌ ఎంత వాడాలి? ఎంత మందం ఉండాలి? తదితర వివరాలు టెండర్‌ డాక్యుమెంట్‌లో పేర్కొన్నారు. జూలై 4న రోశయ్య జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించాలని భావిస్తున్నారు. ఆలోపు విగ్రహం ఏర్పాటు చేయడంతోపాటు.. ఆ ప్రాంతంలో సుందరీకరణ పూర్తి చేయనున్నట్టు అధికారులు తెలిపారు. బుధవారం నుంచి 17వ తేదీ వరకు బిడ్‌ల దాఖలుకు అవకాశముందని పేర్కొన్నారు.

Updated Date - May 14 , 2025 | 04:18 AM