Share News

Telangana Secretariat: సచివాలయానికి ‘స్క్రూ’ ఫిట్టింగ్‌!

ABN , Publish Date - Aug 30 , 2025 | 01:16 AM

సచివాలయం లోపలివైపు గోడలకు ఎటు చూసినా ‘స్క్రూ’ ఫిట్టింగ్‌లే కనిపిస్తున్నాయి. వానలకు జీఎ్‌ఫఆర్‌సీ(గ్లాస్‌ ఫైబర్‌ రీఇన్‌ఫోర్స్‌డ్‌ కాంక్రీట్‌) ఫ్రేమ్‌లు ఊడిపడకుండా ‘స్ర్కూ’లతో బిగిస్తున్నారు.

Telangana Secretariat: సచివాలయానికి ‘స్క్రూ’ ఫిట్టింగ్‌!

  • వానలకు జీఎ్‌ఫఆర్‌సీ ఫ్రేమ్‌లు ఊడకుండా అమరిక

  • పగుళ్లు వచ్చిన చోట సైతం స్ర్కూలను బిగించిన వైనం

హైదరాబాద్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): సచివాలయం లోపలివైపు గోడలకు ఎటు చూసినా ‘స్ర్కూ’ ఫిట్టింగ్‌లే కనిపిస్తున్నాయి. వానలకు జీఎ్‌ఫఆర్‌సీ(గ్లాస్‌ ఫైబర్‌ రీఇన్‌ఫోర్స్‌డ్‌ కాంక్రీట్‌) ఫ్రేమ్‌లు ఊడిపడకుండా ‘స్క్రూ’లతో బిగిస్తున్నారు. అంతేకాదు.. గోడలకు పగుళ్లు వచ్చిన చోట కూడా మరమ్మతులు చేయకుండానే.. స్ర్కూలను అమర్చుతుండడం గమనార్హం. రాష్ట్ర పాలనకు గుండెకాయలాంటి సచివాలయంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐదో అంతస్తు నుంచి, జూలైలో గ్రౌండ్‌ ఫ్లోర్‌ నుంచి రెండో అంతస్తు కిటికీ వరకు అమర్చిన జీఎ్‌ఫఆర్‌సీ రెయిలింగ్‌ ఊడిపడిన విషయం తెలిసిందే. ఆయా సమయాల్లో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. ఫిబ్రవరిలో జరిగిన ప్రమాదంతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు ఘటనపై విచారణ కోసం ఒక కమిటీని నియమించారు.


‘‘సచివాలయంలో చాలా చోట్ల పగుళ్లున్నాయి. కొన్ని పిల్లర్లకు అమర్చిన డిజైన్‌ ఫ్రేమ్స్‌కూ పగుళ్లు వచ్చాయి. బయట అందంగా కనిపించేందుకు అంతస్తుల వారీగా పెట్టిన రెయిలింగ్‌లకు లోపలివైపు నట్లు బిగించి ఉన్నాయి. వర్షపు నీరు లోపలికి చేరడంతో ఆ నట్లు తుప్పు పట్టి.. ఒక చోట జీఎ్‌ఫఆర్‌సీ ఫ్రేమ్‌ ఊడి పడింది’’ అని పేర్కొంటూ ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. ఇప్పుడు ఆ ఫ్రేమ్‌లే వానలకు తడిసి ఊడిపోతున్నాయి. జాగ్రత్త చర్యల్లో భాగంగానే నిర్మాణ సంస్థే జీఆర్‌సీ ఫ్రేమ్‌లు ఊడిపోకుండా ఉండేలా ‘స్ర్కూ’లను బిగిస్తున్నట్టు సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు.

Updated Date - Aug 30 , 2025 | 01:16 AM