జనరిక్ ఔషదాలు ఆరోగ్య సంరక్షణలో ముఖ్య పాత్ర పోషిస్తాయి
ABN , Publish Date - Mar 07 , 2025 | 11:24 PM
జనరిక్ ఔషదాలు ఆరోగ్య సంర క్షణలో ముఖ్య పాత్ర పోషిస్తాయని డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్ పేర్కొన్నారు. శుక్రవారం జన్నారం మండల కేంద్రంలో ప్రధానమంత్రి భారతీయ జనరిక్ ఔషధ కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.

-డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్
జన్నారం, మార్చి 7 (ఆంధ్రజ్యోతి) : జనరిక్ ఔషదాలు ఆరోగ్య సంర క్షణలో ముఖ్య పాత్ర పోషిస్తాయని డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్ పేర్కొన్నారు. శుక్రవారం జన్నారం మండల కేంద్రంలో ప్రధానమంత్రి భారతీయ జనరిక్ ఔషధ కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లాకు మూడు జనరి క్ ఔషద కేంద్రాలు మంజూరయ్యాయని, జన్నారం, బెల్లంపల్లి, మంచిర్యా లలో ఈ కేంద్రాలను ప్రారంభించామన్నారు. జనరిక్ మందులు భద్రతమైన సమర్ధవంతమైన తక్కువ ఖర్చుతో లభించే బ్రాండెడ్ ఔషదాల ప్రత్యా మ్నాయంగా అందుబాటులో ఉంటాయన్నారు. జనరిక్ ఔషధాల ధర 80 నుంచి 90 శాతం తక్కువగా ఉంటుందని, ప్రపంచ ఆరోగ్య సంరక్షణలో జనరిక్ ఔషధం ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు. దేశంలో సన్ ఫార్మా, సిప్లా డాక్టర్ రెడ్డిస్ భారతీయ కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా జనరిక్ ఔషదాలను తయారు చేస్తున్నాయని తెలిపారు. ప్రజలందరు జనరిక్ మెడిసిన్ కేంద్రాల ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప వైద్యాధికారి అనిత, డీపీవో ప్రశాంతి, డాక్టర్‌లు పద్మ, జిల్లా ఫార్మాసిస్టు ఉమాశ్రీశంకర్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ చందన, , మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్, ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.