Share News

సీఎం, మంత్రుల ఐటీ చెల్లింపు వివరాలివ్వండి

ABN , Publish Date - Mar 11 , 2025 | 04:07 AM

ముఖ్యమంత్రి, మంత్రుల జీత భత్యాలపై ప్రభుత్వ ఖజానా నుంచి ఎంత ఆదాయ పన్ను చెల్లించారో వెల్లడించాలని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (ఎఫ్‌జీజీ) డిమాండ్‌ చేసింది.

సీఎం, మంత్రుల ఐటీ చెల్లింపు వివరాలివ్వండి

  • సీఎ్‌సకు ఎఫ్‌జీజీ లేఖ

హైదరాబాద్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి, మంత్రుల జీత భత్యాలపై ప్రభుత్వ ఖజానా నుంచి ఎంత ఆదాయ పన్ను చెల్లించారో వెల్లడించాలని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (ఎఫ్‌జీజీ) డిమాండ్‌ చేసింది. ఈమేరకు ఎఫ్‌జీజీ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఐటీ చెల్లింపు వివరాలను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పెట్టాలని, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వం చెల్లించబోదంటూ ఉత్తర్వులు జారీ చేయాలని ఎఫ్‌జీజీ కోరింది.


సీఎం, మంత్రుల జీతభత్యాల చట్టం-1953లోని సెక్షన్‌ 3 ప్రకారం సీఎం, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, క్యాబినెట్‌ హోదా ఉన్న కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వ సలహాదారుల ఆదాయ పన్నును ప్రభుత్వమే చెల్లించడం సరికాదని, ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ సీఎ్‌సకు లేఖలు రాసినా ఫలితం కనిపించలేదని ఎఫ్‌జీజీ ఆరోపించింది. 2014-15 ప్రకారం అప్పటి సీఎంకు సంబంధించి 15,39,111 ఆదాయ పన్నును చెల్లించారని, ఇందుకు సంబంధించిన ఆదాయం ఎంత ఉందో బయటపెట్టాలని డిమాండ్‌ చేసింది.

Updated Date - Mar 11 , 2025 | 04:07 AM