BRS: హరీశ్‌పై కవిత వ్యాఖ్యలు బాధాకరం: ప్రశాంత్‌రెడ్డి
ABN , Publish Date - Sep 04 , 2025 | 04:15 AM
ఉద్యమం అయినా, పాలన అయినా కేసీఆర్ వెన్నంటే ఉంటూ 25 సంవత్సరాలుగా నిస్వార్థంగా బీఆర్‌ఎస్ కోసం పని చేస్తున్న హరీశ్‌రావుపై కవిత వ్యాఖ్యలు చేయడం బాధాకరం అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
బీఆర్‌ఎ్‌సకు గొప్ప సంపద హరీశ్: నిరంజన్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): ఉద్యమం అయినా, పాలన అయినా కేసీఆర్ వెన్నంటే ఉంటూ 25 సంవత్సరాలుగా నిస్వార్థంగా బీఆర్‌ఎస్ కోసం పని చేస్తున్న హరీశ్‌రావుపై కవిత వ్యాఖ్యలు చేయడం బాధాకరం అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధికి, ప్రజల సంక్షేమం కోసం, పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తి హరీశ్‌రావు అని బుధవారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. చరిత్రలో వీరబ్రహ్మానికి.. సిద్థయ్యలాగా.. కేసీఆర్ ఏది చెబితే.. హరీశ్‌రావు ఆ విధంగా పనిచేస్తుంటారని.. పార్టీకి ఆయన గొప్ప సంపద.. అని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎవరికో బలం చేకూర్చడానికి కొంతమంది హరీశ్‌రావును టార్గెట్ చేసి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.