Share News

విదేశీ బాట..

ABN , Publish Date - Feb 10 , 2025 | 11:43 PM

బీటెక్‌ పూర్తికాగానే యువత డాలర్‌ డ్రీమ్స్‌లో తేలిపోతోంది. పట్టా చేతికందగానే విదేశాలకు పయనం అయ్యేందుకు తహతహలాడుతోంది. తక్కువ శ్రమ ఎక్కువ ప్ర తి ఫలం...అనతికాలంలోనే కోట్లకు పడగలెత్తే అవకా శాలుండటం.. విలాసాలతో కూడిన ఆధునిక జీవన శైలి.. నాణ్యమైన ప్రమాణాలు.. ఇలా ఒక్కటేమిటి అ నేకానేక అంశాలు.. యువత విదేశాలకు వెళ్లేందుకు పురిగొల్పుతున్నాయి.

విదేశీ బాట..

-ప్రతీ 10 మందిలో నలుగురిది అదే ఆలోచన

-ఆర్థిక పరిస్థితులు మెరుగుపర్చుకోవడమే లక్ష్యం

-మద్యతరగతి కుటుంబాల నుంచే ఎక్కువ పయనం

మంచిర్యాల, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): బీటెక్‌ పూర్తికాగానే యువత డాలర్‌ డ్రీమ్స్‌లో తేలిపోతోంది. పట్టా చేతికందగానే విదేశాలకు పయనం అయ్యేందుకు తహతహలాడుతోంది. తక్కువ శ్రమ ఎక్కువ ప్ర తి ఫలం...అనతికాలంలోనే కోట్లకు పడగలెత్తే అవకా శాలుండటం.. విలాసాలతో కూడిన ఆధునిక జీవన శైలి.. నాణ్యమైన ప్రమాణాలు.. ఇలా ఒక్కటేమిటి అ నేకానేక అంశాలు.. యువత విదేశాలకు వెళ్లేందుకు పురిగొల్పుతున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది ఎంఎస్‌ చదువుల పేరుతో అమెరికా, ఆస్ట్రేలి యా, కెనడా, జర్మని, యూకే వంటి దేశాలకు తరలి పోతున్నారు. ఇండియాలో ఉద్యోగ అవకాశాలు, సం పాదన, జీవనశైలి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో నేటి యువత విదేశాలకు తరలివెళ్లేందుకే మొగ్గు చూపుతోంది. తమ కుటుంబంలోని వాళ్లు, ఊరి వా ళ్లు, బంధువులు అప్పటికే విదేశాల్లో స్థిరపడటంతో వారి ప్రోత్సాహంతో ప్రతియేటా పెద్ద సంఖ్యలో యు వత విదేశాల బాటపడుతున్నారు. ఒకప్పుడు ఊరికి ఒక్కరు విదేశాల్లో ఉంటే గొప్పగా చెప్పుకునే రోజుల నుంచి ప్రతీ గ్రామం నుంచి పదుల సుఖ్యలో వెళ్లే రోజులు వచ్చాయి. మాస్టర్స్‌ చదువు అయినా, తక్కు వ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాధించడం తోపాటు అక్కడే స్థిరపడే లక్ష్యంతో యువత విదే శాలను ఎంచుకుంటోంది.

మధ్యతరగతి కుటుంబాల నుంచే ఎక్కువ...

పడిపోతున్న రూపాయి విలువ, తగ్గిపోతున్న ఉ పాధి అవకాశాలు, ఉద్యోగం లభించేందుకు కాలయా పన... వీటన్నింటికి మించిన భటుంబ ఆర్థిక పరిస్థితు లు యువత విదేశాలకు వెళ్లడానికి కారణాలుగా కని పిస్తున్నాయి. ఎంతో కష్టపడి చదివించిన తల్లితండ్రు లకు తాము భారం కాకూడదనకుంటున్నారు. చాలా మంది యువత తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుప ర్చుకునేందుకు విదేశాలకు వెళ్లేందుకు సిద్ధపడుతు న్నారు. అందుకోసం కొంత ఆర్థిక భారమైనా సరే బ్యాంకు లోన్లు తీసుకుని మరీ విదేశాల్లో చదువుకు నేందుకు పయనమవుతున్నారు. అలా పయనమ య్యే వారిలో అత్యధిక శాతం మంది మధ్యతరగతి కుటుంబాల నుంచే ఉండటం గమనార్హం. జిల్లా వ్యా ప్తంగా విదేశాల్లో డిగ్రీ చదివేందుకు వెళ్తున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. మారుమూల గ్రామా ల్లో నుంచి సైతం అమెరికా, యూకే, కెనడా, జర్మనీ, తదితర విదేశాలకు వెళ్లిన వారు ఉన్నారు.

వెళ్లడానికి కారణాలివే...

ముఖ్యంగా విదేశాల్లో ఉపాధి అవకాశాలు బాగుం టాయన్న ఆలోచన యువతలో ఉంది. ఇక్కడ చదు వు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం వేచి చూడా ల్సి వస్తుందని, ఆ కారణంగా తల్లిదండ్రులపై ఆధార పడాల్సి రావడం వల్ల వారికి ఆర్థిక భారంగా మా రాల్సి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విదేశాల్లో అయితే చదువుతోపాటు ఉద్యోగం కూడా చేసుకోవచ్చుననే కారణంతో అక్కడికి వెళ్లేందుకు సి ద్ధపడుతున్నారు. విదేశాల్లో వేతన సరళి కూడా గం టల చొప్పున ఉంటుందని, అక్కడ పనిచేస్తూ చదువు కోవడం ద్వారా తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడదనే భావనలో అనేక మంది ఉన్నారు. మరికొందరు విదేశీ డిగ్రీకి విలువ ఉందని భావించి అక్కడకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. విదేశాల్లో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఎ క్కువ మొత్తంలో ప్యాకేజీలు లభిస్తాయని, ఒకవేళ అ క్కడినుంచి తిరిగి వచ్చినప్పటికీ స్వదేశంలో అత్యధి క వేతనాలతో కంపెనీలు ఆఫర్లు ఇస్తాయన్న భావన కూడా ఉంది.

సొంత నిర్ణయంతోనే.....

అత్యధిక శాతం యువత తమ సొంత నిర్ణయాల తోనే విదేశాలబాట పడుతున్నారు. ఎంత కష్టమైనా సరే.. తల్లిదండ్రులను ఒప్పించి మరీ పయనమవు తున్నారు. ఉన్నత చదువు పూర్తయిన తరువాత తి రిగి వద్దామనే ఆలోచన తక్కువ మందిలో ఉండగా, పార్ట్‌ జాబ్‌ చేసైనా అక్కడే స్థిరపడాలనే ఆలోచనలో అధికశాతం మంది ఉన్నారు. కుటుంబా ఆర్థిక పరిస్థి తి అంతంత మాత్రంగానే ఉన్న పిల్లల బలమైన కోరి కను తీర్చేందుకు తల్లిదండ్రులు అంగీకరించక తప్పని పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంకుల్లో ఎడ్యుకేషన్‌ లోన్లు తీసుకొని వెళ్తున్నవారే అధికంగా ఉంటున్నారు. చదువు పూర్తయ్యే వరకు నెలవారీ కిస్తు లు కట్టాల్సిన అవసరం ఉండకపోవడం, ఆ తరువాత ఏదో ఒక ఉద్యోగంలో చేరుతామనే గట్టి నమ్మ కంతో విదేశాలబాట పడుతున్నారు.

లక్ష్యంతో వెళ్లితేనే భవిష్యత్‌

జీపీవీ శేఖర్‌, రిటైర్డ్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

నేడు విదేశాలకు వెళ్లే యువతను రెండు ర కాలుగా చూడ వచ్చు. మొదటిది చాలినంత నై పుణ్యంతో వెళ్లి విదేశాల్లో గౌరవ ప్రదమైన జీ వితం గడపాలనే ఆలోచన. రెండవది ఏదోలా ఫారిన్‌ వెళ్లాలి, పార్ట్‌టైం జాబ్‌ చేస్తే సరిపోతుందన్న ఆలోచన. రెం డవ ఆలోచన అత్యంత ప్రమాదకరం. ఫారిన్‌ యూనివర్సిటీ అయి నా.. మరే దయినా.. ఫీజులు తీసుకునే విద్యను అందిస్తాయి. యూ నివర్సిటీలకు ఆదే ఆదాయం. విదేశాల్లో డిగ్రీ చేయాలంటే రూ. 50 లక్షల వరకు ఫీజులు చెల్లించాలి. వాటి కోసమైనా యూనివర్సిటీ లు అడ్మిషన్లు ఆఫర్‌ చేస్తాయి. నిజంగా స్కిల్‌ ఉండి వెళ్లే వారు కే వలం 20 శాతం మంది మాత్రమే. మిగతా వారు భవిష్యత్తు ఎలా ఉంటుందన్న అవగాహన లేకుండా, నిబంధనలు తెలియకుండా వె ళ్తున్నారు. దీంతో పార్ట్‌ టైం జాబ్స్‌ చేస్తూ ఇబ్బందులు పడుతు న్నారు. ప్రస్తుతం కొన్ని దేశాల్లో ఆర్థిక స్థితిగతుల ధృష్ట్యా కఠిన మైన ఆంక్షలు విధిస్తున్నారు. ఈ కారణంగా పార్ట్‌ టైం జాబ్స్‌ చే సేవారికి ఇబ్బందులు తప్పవు. స్థిరమైన, క్రమశిక్షణతో కూడిన జీవి తం కావాలనుకునే వారు తమ నైపుణ్యాన్ని దృష్టిలో ఉంచుకొని విదేశాలకు వెళితే భవిష్యత్తు ఉంటుంది.

Updated Date - Feb 10 , 2025 | 11:43 PM