Share News

ఆయకట్టు కింది భూములకు . సాగు నీరందిస్తాం

ABN , Publish Date - Jan 10 , 2025 | 12:50 AM

ఎస్సారెస్పీ కా లువల కింద ఉన్న ఆయ కట్టు కింది చివరి పంట భూములకు సాగు నీరందిస్తామని, రైతులు నిశ్చింత గా యాసంగి పంటలను సాగు చేసుకోవచ్చని ప్రభు త్వ విప్‌, ఎమ్మేల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ రైతులకు భరోసానిచ్చారు.

ఆయకట్టు కింది భూములకు .  సాగు నీరందిస్తాం

విప్‌, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

గొల్లపల్లి, జనవరి 9 (ఆంధ్రజ్యోతి) : ఎస్సారెస్పీ కా లువల కింద ఉన్న ఆయ కట్టు కింది చివరి పంట భూములకు సాగు నీరందిస్తామని, రైతులు నిశ్చింత గా యాసంగి పంటలను సాగు చేసుకోవచ్చని ప్రభు త్వ విప్‌, ఎమ్మేల్యే అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ రైతులకు భరోసానిచ్చారు. గురువారం గొల్లపల్లి మండలం రం గదాముని పల్లె పెద్ద చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ పా లకుల నిర్లక్ష్యం వల్ల తాగు, సాగునీటికి ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు. గొల్లపల్లి మండలం రంగదాముని పల్లె పెద్ద చెరువు కింద గొల్లపల్లి, వెల్గటూర్‌, పెగ డపల్లి మండలాల్లో సుమారు 700 వందల ఎకరాల కు పైగా సాగు చేసుకుంటున్నారన్నారు. పదేళ్లుగా అ ధికారంలో ఉన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సా గు నీరందించేందుకు ఏలాంటి చర్యలు చేపట్టలేదన్నా రు. కాళేశ్వరం లింక్‌-2 పేరుతో పేద రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారే తప్ప పంట భూములకు సాగు నీరందించలేకపోయారని విమ ర్శించారు. రంగదాముని పల్లె పెద్ద చెరువును రిజ ర్వాయర్‌గా మార్చేందుకు సాయశక్తుల కృషి చేసి భూములను సస్యశ్యామలం చేస్తానని రైతులకు హా మీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ సం తోష్‌, వైస్‌ చైర్మన్‌ రాజిరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు నిశాంత్‌రెడ్డి, యూత్‌ అధ్యక్షుడు పు రంశెట్టి గౌతమ్‌రాజు, తాజామాజీ ప్రజాప్రతినిధులు గంగాధర్‌, సత్యానారాయణ గౌడ్‌, పద్మ వెంకటేశం పాల్గొన్నారు.

అప్పులు ఉన్నా సంక్షేమ పథకాల అమలు

వెల్గటూర్‌, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): గత బీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం పాలన వలన అప్పులు ఉన్నా వెను కంజ వేయకుండా ఆంగ్రెస్‌ ప్రభుత్వం వాటిని తీరు స్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఎమ్మె ల్యే, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ తెలిపా రు.. గురువారం వెల్గటూర్‌ మండల కేంద్రంలో 69 మందికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు, 49 మందికి కల్యా ణలక్ష్మి, షాది ముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. తహసీల్దార్‌ శేఖర్‌, ఎంపీడీవో రవీంధర్‌, ఏఎంసీ చైర్మ న్‌ గోపిక జితేంధర్‌రెడ్డి, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు శైలేంధర్‌ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2025 | 12:50 AM