నిబంధనలను పాటిస్తూ వాహనం నడపాలి
ABN , Publish Date - Jan 20 , 2025 | 01:13 AM
నిబంధనలను పాటిస్తూ, వాహనం నడపాలని జగిత్యాల ట్రాఫిక్ ఎస్పై మల్లేశం సూచించారు. పట్టణం లోని యావర్‌రోడ్ పార్క్ సమీపంలో ట్రాలీ ఆటో డ్రైవర్లకు ఆదివారం జాతీ య రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా డ్రైవర్లకు రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ సేఫ్టీ పై అవగాహన కల్పించారు.
జగిత్యాల ట్రాఫిక్ ఎస్సై మల్లేశం
జగిత్యాల అగ్రికల్చర్, జనవరి 19(ఆంధ్రజ్యోతి): నిబంధనలను పాటిస్తూ, వాహనం నడపాలని జగిత్యాల ట్రాఫిక్ ఎస్పై మల్లేశం సూచించారు. పట్టణం లోని యావర్‌రోడ్ పార్క్ సమీపంలో ట్రాలీ ఆటో డ్రైవర్లకు ఆదివారం జాతీ య రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా డ్రైవర్లకు రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ సేఫ్టీ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైవర్లు విధిగా యూనిఫాం ఽధరించాలని, వాహన సంబంధ ఽధృవపత్రాలను అందుబా టులో ఉంచుకోవాలన్నారు. మద్యం సేవించి, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహ నం నడపరాదని సూచించారు. ప్రమాదాల నివారణలో తమవంతు తోడ్పా టును అందించాలని కోరారు. ఈ సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేసి డ్రైవర్లతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ శంకర్, హోంగార్డులు లక్ష్మణ్, సంతోష్, పాషాతో పాటు ట్రాలీ ఆటోల డ్రైవర్లు పాల్గొన్నారు.