Share News

Tunga Bhadra: తెరుచుకున్న తుంగభద్ర గేట్లు!

ABN , Publish Date - Jul 05 , 2025 | 04:04 AM

కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులకు క్రమంగా వరద పెరుగుతోంది. కృష్ణా, తుంగభద్ర నదుల ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద పెరుగుతోంది.

Tunga Bhadra: తెరుచుకున్న తుంగభద్ర గేట్లు!

గద్వాల/దోమలపెంట, జూలై 4 (ఆంధ్రజ్యోతి): కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులకు క్రమంగా వరద పెరుగుతోంది. కృష్ణా, తుంగభద్ర నదుల ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద పెరుగుతోంది. శుక్రవారం కర్ణాటకలోని తుంగభద్ర గేట్లు తెరుచుకున్నాయి. ప్రాజెక్టుకు 75,612 క్యూసెక్కుల ప్రవాహాలు చేరగా 58 గేట్లకు గాను 21 గేట్లను ఎత్తి 62,612 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 105.79 టీఎంసీలకు.. ప్రస్తుతం 75.84 టీఎంసీలున్నాయి. దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్టుకు 1,09,777 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా ఏపీ, తెలంగాణ విద్యుదుత్పత్తి కోసం 56,998 క్యూసెక్కులను వినియోగిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 215 టీఎంసీలకు ప్రస్తుతం 169.86 టీఎంసీలున్నాయి.


తుంగభద్ర గేట్లు తెరవడంతో శ్రీశైలానికి వరద మరింత పెరిగే అవకాశముంది. ఇక ఆల్మట్టికి వరద స్థిరంగా కొనసాగుతోంది. 94,767 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. లక్ష క్యూసెక్కులను దిగువకు విడుస్తున్నారు. జూరాలకు 1.15 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు వస్తుండగా 14గేట్ల ద్వారా 95,566, విద్యుదుత్పత్తి ద్వారా 29,494 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.

Updated Date - Jul 05 , 2025 | 04:04 AM