Share News

ముగిసిన ధ్వజస్తంభ ప్రతిష్ఠోత్సవాలు

ABN , Publish Date - Mar 07 , 2025 | 12:13 AM

మండలంలోని నారమ్మగూడెం గ్రామంలో సీతారామ, వేంకటేశ్వర, శివాలయం ఆలయాల్లో మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహించిన ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠోత్సవాలు గురువారం ముగిశాయి.

ముగిసిన ధ్వజస్తంభ ప్రతిష్ఠోత్సవాలు
Flag hoisting ceremonies concluded

నారమ్మగూడెంలో ధ్వజస్థంభం ప్రతిష్ఠాపనలో పాల్గొన్న భక్తులు

నిడమనూరు, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని నారమ్మగూడెం గ్రామంలో సీతారామ, వేంకటేశ్వర, శివాలయం ఆలయాల్లో మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహించిన ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠోత్సవాలు గురువారం ముగిశాయి. మూడు రోజుల పాటు మూడు ప్రధాన ఆలయాల్లో విఘ్నేశ్వర పూజ, చండీయాగం, రుద్రాభిషేకం, క్షీరాదివాసం తదితర కార్యక్రమాలతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మేళ్లచెరువుకు చెందిన ప్రముఖ యజ్ఞప్రతీక కొంకపాక రాధాకృష్ణమూర్తి, గుదె లక్ష్మీనర్సయ్య పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు కన్నుల పండువగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ ధ్వజస్తంభ ప్రతిష్ఠోత్సవ కార్యక్రమాన్ని శాస్త్ర్తోక్తంగా నిర్వహించారు. పరిసర గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు చేశారు. బుసిరెడ్డి ఫౌండేషన్‌ అధ్యక్షుడు పాండురంగారెడ్డి ఉత్సవాల్లో పాల్గొని ఆలయాలకు రూ.లక్ష విరాళం అందజే శారు. భక్తులకు మహాఅన్నదానం చేశారు. ఎమ్మెల్సీ ఎంసీ. కోటిరెడ్డి పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్‌ బైరెడ్డి సత్తిరెడ్డి, కొండా శ్రీనివాస్‌రెడ్డి, బైరెడ్డి వెంకట్‌రెడ్డి, గడ్డం గోవిందరెడ్డి, బైరెడ్డి సత్యనారాయణరెడ్డి, వల్లభ్‌రెడ్డి, అంకతి సత్యం, నందికొండ మట్టారెడ్డి, శివమారయ్య, సైదిరెడ్డి, సీతారాంరెడ్డి, యుగంధర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఘనంగా లక్ష్మీ వేంకటేశ్వరస్వామి రథోత్సవం

డిండి: మండలంలోని దాసరినెమలిపూర్‌ గ్రామంలో లక్ష్మీ వేంకటేశ్వరస్వామి రథోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారంభమైన బ్రహోత్సవాలు గురువారం ముగి శాయి. తెల్లవారుజామున కల్యాణ వేంకటేశ్వరస్వామి రథాన్ని పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్‌ గంగిడి వెంక ట్‌రెడ్డి మాట్లాడుతూ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహోత్సవాలు పూర్ణాహుతి, అవబృతస్నానం, ఏకాంతసేవతో ముగిసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ నర్సింహారావు, గంగిడి నరేందర్‌రెడ్డి, పాల కొల్లు బాలయ్య, గంగిడి మాధవరెడ్డి, రామచంద్రం, జాహంగీర్‌, కొండల్‌రెడ్డి, దేప వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 07 , 2025 | 12:13 AM