Share News

Seven Hills Express: సెవెన్‌ హిల్స్‌ ఎక్స్‌ప్రెస్‌‌కు తప్పిన ప్రమాదం

ABN , Publish Date - Jun 17 , 2025 | 04:57 AM

తిరుపతి నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే సెవెన్‌ హిల్స్‌ ఎక్స్‌ప్రె్‌సకు (నంబర్‌ 12769) బ్రేక్‌ బైండింగ్‌ కావడంతో మంటలు చేలరేగాయి.

Seven Hills Express: సెవెన్‌ హిల్స్‌ ఎక్స్‌ప్రెస్‌‌కు తప్పిన ప్రమాదం

  • బ్రేక్‌ బైండింగ్‌తో మంటలు.. చైన్‌ లాగిన ప్రయాణికులు

ధర్మవరం రూరల్‌, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): తిరుపతి నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే సెవెన్‌ హిల్స్‌ ఎక్స్‌ప్రె్‌సకు (నంబర్‌ 12769) బ్రేక్‌ బైండింగ్‌ కావడంతో మంటలు చేలరేగాయి. ప్రయాణికులు అప్రమత్తమై చైన్‌ లాగడంతో ప్రమాదం తప్పింది. సోమవారం రాత్రి 8.40 గంటల సమయంలో శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం చిగిచెర్ల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.


గార్డు ఉన్న బోగీ ముందుభాగం చక్రాల వద్ద బ్రేకు బైండింగ్‌ అయి మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన గార్డు ట్రైన్‌ను అపేందుకు బీబీసీ బ్రేకు వేశారు. ప్రయాణికులు కూడా చైన్‌ లాగారు. రైలు ఆగగానే ప్రయాణికులు కిందకు దూకారు. చీకట్లో కంకర రాళ్లల్లో కేకలు వేస్తూ పరుగులు తీశారు. వెంటనే గార్డు మంటలను అగ్నిమాపక పరికరాలతో ఆర్పివేశారు. ఈ ఘటనతో సుమారు అరగంట పాటు రైలు ఆగిపోయింది.

Updated Date - Jun 17 , 2025 | 04:57 AM