Share News

భీమారం-సూర్యాపేట రోడ్డుపై గుంతలు పూడ్చివేత

ABN , Publish Date - Jan 17 , 2025 | 12:03 AM

వేములపల్లి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్రధాన రహ దారి భీమారం- సూర్యాపేట రోడ్డుపై గుంతలపడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

   భీమారం-సూర్యాపేట రోడ్డుపై గుంతలు పూడ్చివేత

వేములపల్లి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్రధాన రహ దారి భీమారం- సూర్యాపేట రోడ్డుపై గుంతలపడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మండలంలోని మొల్కపట్నం గ్రామా నికి చెందిన కాంగ్రెస్‌ మండల నాయకుడు పాదూరి కిరణ్‌రెడ్డి గురువారం రూ. 20 వేల సొంత నిధులతో గుంతలను పూడ్చివేశారు. సంక్రాంతి రోజు తమ గ్రామానికి చెందిన పోరెడ్డి వెంకటరమణరెడ్డి రోడ్డుపై ఉన్న గుంతల వల్ల ప్రమాదం జరిగి మృతి చెందడంతో స్పందించి రోడ్డుపై ఉన్న ప్రమాదకర ప్రాంతాల్లో మట్టిని పోసి గుంతలను పూడ్చివేయించారు. శెట్టిపాలెం, మొల్కపట్నం గ్రామాల మధ్య ఉన్న రోడ్డుపై గుంతల పడి తరుచు ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని పూడ్చడంలో మాత్రం ఆర్‌అండ్‌బీ అధికారులు, కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తారు రోడ్డు వేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పులిపాక నాగేందర్‌, బొమ్మగాని సురేష్‌, వెంకటరమణ, నరేష్‌, సతీష్‌, యాదగిరి ఉన్నారు.

Updated Date - Jan 17 , 2025 | 12:03 AM