Share News

పరిహారం కోసం పోరు

ABN , Publish Date - Jan 08 , 2025 | 11:43 PM

భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని ఎల్కేశ్వరం రైతుల పోరు ఉధృతమైంది. చిన్నకాళేశ్వ రం ప్రాజెక్టు పరిధిలోని మందరం చెరువు నుంచి ఎన్కపల్లి వరకు నిర్మించనున్న మెయిన్‌ కెనాల్‌ పనులను ఎల్కేశ్వరం రైతులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తోంది. తమ భూములను సేకరించిన అధికారులు పరిహారం ఇచ్చాకే పనులను ప్రారంభించాలని రైతులు భీష్మించుకు న్నారు.

పరిహారం కోసం పోరు
ట్రంచ్‌ పనులను అడ్డుకుంటున్న రైతులు

చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై ఎల్కేశ్వరం రైతుల నిరసనలు

దశల వారీ ఆందోళనలు.. అడ్డగింతలు

పరిహారం ఇచ్చాకే కెనాల్‌ నిర్మాణం ప్రారంభించాలని డిమాండ్‌

పోలీసు బందోబస్తు నడుమ పనులు.. తీవ్ర ఉద్రిక్తత

మహదేవపూర్‌ రూరల్‌, జనవరి 8(ఆంధ్రజ్యోతి): భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని ఎల్కేశ్వరం రైతుల పోరు ఉధృతమైంది. చిన్నకాళేశ్వ రం ప్రాజెక్టు పరిధిలోని మందరం చెరువు నుంచి ఎన్కపల్లి వరకు నిర్మించనున్న మెయిన్‌ కెనాల్‌ పనులను ఎల్కేశ్వరం రైతులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తోంది. తమ భూములను సేకరించిన అధికారులు పరిహారం ఇచ్చాకే పనులను ప్రారంభించాలని రైతులు భీష్మించుకు న్నారు. 12 రోజులుగా వీరు దశల వారీగా నిరసన లకు దిగుతున్నారు. ఐదు రోజులుగా వీరి పోరాటం మరింత ఉధృతమవుతోంది. పనులు చేపట్టేందుకు అధికారులు రావడం, వారిని రైతులు అడ్డుకోవడం లాంటి పరిణామాలు చోటుచేసు కుంటున్నాయి. ఇదే క్రమంలో మంగళవారం భారీ పోలీసు బందోబ స్తు నడుమ అధికారులు పనులు ప్రారంభించేందు కు యత్నించగా రైతులు మళ్లీ అడ్డుకున్నారు. పోలీసులు వారిని నిలువరించేందుకు యత్నించగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ క్రమంలో రాళ్లబండి రజిత అనే మహిళ ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది.

ట్రంచ్‌ పనులు చేపడుతుండగా..

తాజాగా అధికారులు బుధవారం భారీ పోలీసు బందోబస్తుతో కెనాల్‌ పనులను చేపట్టేందుకు రాగా ఎల్కేశ్వరం రైతులు మళ్లీ నిరసనకు దిగారు. పనుల ను అడ్డుకొనేందుకు యత్నించగా వారిని పోలీసులు నిలవరించారు. ఇరిగేషన్‌ అధికారులు కెనాల్‌కు ఇరువైపులా ట్రెంచ్‌ పనులు ప్రారంభించగా ప్రొక్లెయినర్‌ ఎదుట బురద లోనే బైఠాయించి అడ్డుకున్నారు. పరిహారం ఇచ్చాకే పనులు చేపట్టాలని భీష్మించు కున్నారు. అయినా అధికారులు పనులను ఆపకపోవడంతో రాళ్లబండి కమల మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో పోలీసులు తమ వాహనంలోనే ఆమెను మహదేవపూర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన అక్కడి డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం భూపాలపల్లి వంద పడకల ఆస్పత్రికి రిఫర్‌ చేసినా కుటుంబ సభ్యులు అక్కడికి తీసుకెళ్లేందుకు ససేమిరా అన్నారు. ఈసందర్భంగా కమల కుమారుడు రవి మాట్లాడుతూ పోలీసులు రైతుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరిస్తూ తన తల్లిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లా ఆరోపించాడు. మహదేవ పూర్‌ ఆస్పత్రిలో జాయిన్‌ చేశాక కూడా తమకు సమాచారం ఇవ్వలేద న్నాడు. మంగళవారం ఒంటిపై పెట్రోల్‌ పోసు కున్న రజిత మాట్లాడు తూ పురుగుల మందు తాగిన కమల తన తల్లి అని, అధికారులు తమ కుటుంబానికి అన్యా యం చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించింది. తన తల్లిని వృద్ధురాలు అని కూడా చూడకుండా పోలీసులు వ్యవహరించిన తీరు అవమానవీయంగా ఉందన్నారు. పలువురు రైతులు మాట్లాడుతూ తమ తాత ముత్తాతల కాలం నుంచి సాగు చేసుకుంటు న్న భూములను ప్రభుత్వం దౌర్జన్యంగా తీసుకుని అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ భూములను రీసర్వే చేయాలని బాధిత రైతులు డిమాండ్‌ చేశారు.

అధికారుల్లో కొరవడిన స్పష్టత

మందరం చెరువు నుంచి ఎన్కపల్లి వరకు నిర్మించనున్న మెయిన్‌ కెనాల్‌ భసేకరణ, పరిహా రంపై రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖల్లో స్పష్టత కొవరడింది. కాల్వ నిర్మాణానికి ఎంత భూమి సేక రించారు.. ఎంత మందికి పరిహారం ఇచ్చారనేది క్లియర్‌ చేయడం లేదు. రెవెన్యూ అధికారులు 110 ఎకరాలని చెబుతుండగా, ఇరిగేషన్‌ అధికారులు 62 ఎకరాలనే పేర్కొంటున్నారు. రైతులు పరిహారం రాలేదంటున్నారు కదా ?అని తహసీల్దార్‌ ప్రహ్లాద్‌ ను వివరణ కోరగా దీనిపై ఆయన స్పష్టత ఇవ్వడం లేదు. కొంత మందికి పరిహారం వచ్చిందని, ఇంకొం త మందికి రాలేదని ఆయన అంటున్నా నిర్దష్ట సంఖ్య చెప్పడం లేదు. ఎల్కేశ్వరంలో ఏడుగురికి పరిహారం రాలేదని తెలియగా అదే విషయాన్ని ఉన్నతాధికారులకు రిపోర్టు చేశామని తెలిపారు. మహదేవపూర్‌ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతు న్న కమల వద్దకు వచ్చిన తహశీల్దార్‌ ప్రహ్లాద్‌ ఆమె ఆరోగ్యపరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకు న్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న సమస యంలో పరిహారంపై రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటూ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ప్రశ్నించ గా సమాధానం చెప్పకుండానే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.

తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన

ఇదే క్రమంలో కమల కుమారుడు రవి సహా పలువురు భూనిర్వాసితులు ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, ఆదివాసీ నాయకులతో మహదేవపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. రైతులకు న్యాయం చేయాలని, దీనిపై కలెక్టర్‌, ప్రభుత్వం స్పందించాలని డిమాండ్‌ చేశారు.

అధికారులతో కలెక్టర్‌ సమీక్ష

ఎల్కేశ్వరంలో చిన్నకాళేశ్వరం మెయిన్‌ కెనాల్‌ ట్రెంచ్‌ పనులను అడ్డుకున్న నేపథ్యంలో కలెక్టరు రాహుల్‌ శర్మ రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులతో పాటు అడిషనల్‌ కలెక్టర్‌, ఎస్పీతో ప్రత్యేక సమావేశమై ఈ సమస్యను సమీక్షించారు. మంత్రి శ్రీధర్‌బాబు సైతం ఎల్కేశ్వరం ఘటనపై ఆరా తీసి అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. ఇదే క్రమంలో ఎల్కేశ్వరం, బొమ్మాపూర్‌ గ్రామాలకు చెందిన సుమారు 20మంది రైతులు పరిహారం విషయమై కలెక్టర్‌ను కలవగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ప్రస్తుతం కెనాల్‌ కోసం మాత్రమే హద్దులు ఏర్పాటు చేస్తున్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సి అవసరం లేదని రైతులతో కలెక్టర్‌ చెప్పినట్లు సమాచారం. కెనాల్‌ పనులు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యేనాటికి భూములు కోల్పోతున్న ప్రతి గ్రామంలో గ్రామసభలు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామని కలెకర్‌ హామీ ఇచ్చారని రైతులు తెలిపారు. బుధవారం ఎల్కేశ్వరం శివారులో కెనాల్‌ హద్దుల ఏర్పాటు పూర్తికావడంతో ముక్తిపెల్లి శివారులో హద్దులు ఏర్పాటు ప్రారంభించారు. ఎల్కేశ్వరం, ముక్తిపెల్లి శివారుకు మధ్యలో కొంత అటవి భూమి ఉండగా అది అటవీ అధికారుల పర్యవేక్షణలోనే హద్దులను ఏర్పాటు చేస్తామని ఇరిగేషన్‌ అధికారులు చెప్పారు. ఇప్పటకే ఆభూమి ఇరిగేషన్‌ పరిధిలో ఉన్నప్పటికీ అటవీ అధికారుల సమక్షంలోనే పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

Updated Date - Jan 08 , 2025 | 11:43 PM