Share News

అర్హులైన వారికే రైతు భరోసా

ABN , Publish Date - Jan 28 , 2025 | 11:33 PM

అర్హులైన రైతులకు ప్రభుత్వం రైతు భరోసా పథక లబ్ధిని చేరవేయడమే ప్రధాన లక్ష్యమని, సంక్షేమ పథకాల అమలులో అధికారులే కీలకమని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు.

అర్హులైన వారికే రైతు భరోసా
మాట్లాడుతున్న కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

- కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

నాగర్‌కర్నూల్‌/ బల్మూరు, జనవరి 28 (ఆంధ్రజ్యోతి) : అర్హులైన రైతులకు ప్రభుత్వం రైతు భరోసా పథక లబ్ధిని చేరవేయడమే ప్రధాన లక్ష్యమని, సంక్షేమ పథకాల అమలులో అధికారులే కీలకమని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశం మందిరంలో ఆర్డీవోలు, తహసీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులతో కలిసి సంక్షే మ పథకాల అమలు తీరుపై నిర్వహించిన స మీక్షా సమావేశంలో చర్చించారు. వ్యవసాయా నికి అనుకూలమైన భూములను మాత్రమే గు ర్తించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్‌ అమరేందర్‌, జిల్లా వ్యవసాయ అధికారి చంద్ర శేఖర్‌, అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి, కొల్లాపూర్‌ ఆర్డీవోలు, కలెక్టరేట్‌ ఏవో చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

రోడ్డు భద్రత అవగాహన పోస్టర్‌ ఆవిష్కరణ

రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రతను పురస్కరించుకుని ముద్రించిన వాల్‌పోస్టర్లు, కర పత్రాలను కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ మంగళ వారం తన చాంబర్‌లో ఆవిష్కరించారు. కార్యక్ర మంలో అదనపు కలెక్టర్‌ దేవసహాయం, జిల్లా రవాణా శాఖ అధికారి చిన్న బాలు, రోడ్డు సేఫ్టీ అధ్యక్షుడు వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ బల్మూరు మండల పరిధిలోని చెంచు గూడెం గ్రామంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రంతో పాటు ఆశ్రమ పాఠశాలను కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ పరిశీలించారు. కార్యక్రమంలో తహసీ ల్దార్‌ శ్రీకాంత్‌, ఎంపీడీవో జట్టి రాఘవులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజలు పాల్గొన్నారు.

కేజీబీవీని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్‌

నాగర్‌కర్నూల్‌ టౌన్‌ : విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ దేవ స హాయం అధికారులను ఆదేశించారు. మంగళ వారం జిల్లా కేంద్రంలోని నాగనూలు కేజీబీవీ పాఠశాలను అదనపు కలెక్టర్‌ తనిఖీ చేశారు. పాఠశాలలోని డార్మెటరీ, స్టోర్‌ రూం, కిచెన్‌, ప్టేగ్రౌండ్‌ను పరిశీలించారు. ఆయన వెంట డీఈవో రమేష్‌కుమార్‌, మునిసిపప్‌ కమీషనర్‌ నరేష్‌కుమార్‌, గణాంక అధికారి మధుసూద న్‌రెడ్డి, కేజీబీవీ ప్రత్యేక అధికారిణి శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 28 , 2025 | 11:33 PM