పశువులను అడవిలోకి అనుమతించాలని రోడ్డెక్కిన రైతులు
ABN , Publish Date - Feb 05 , 2025 | 11:29 PM
కవ్వాల టైగర్ జోన్‌పరిధిలోని జన్నారం డివిజన్‌లో గల ఇం దన్‌పల్లి రేంజ్ అటవీ ప్రాంతంలోకి మేతకు పశు వులను అనుమతించాలని డిమాండ్ చేస్తూ బుధవా రం రేంజ్ కార్యాలయం ముందు ఉన్న ప్రధాన రహ దారిపై పశువులతో రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు.
-పశువుల కాపరిపై దాడి చేసి బీట్ అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్
జన్నారం, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి) : కవ్వాల టైగర్ జోన్‌పరిధిలోని జన్నారం డివిజన్‌లో గల ఇం దన్‌పల్లి రేంజ్ అటవీ ప్రాంతంలోకి మేతకు పశు వులను అనుమతించాలని డిమాండ్ చేస్తూ బుధవా రం రేంజ్ కార్యాలయం ముందు ఉన్న ప్రధాన రహ దారిపై పశువులతో రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మంగళవారం ఇందన్‌పల్లి రేంజ్‌లో పనిచేస్తున్న బీట్ అధికారి రుబీనా పశువుల కాపరి గోపాల్‌పై అడవి వైపు పశువులను ఎందుకు తీసుకువస్తున్నావని గో పాల్‌పై దాడి చేసిందని వెంటనే ఆమెను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇందన్‌పల్లి రేంజ్ పరిధిలో గల అటవీ ప్రాంతంలోకి పశువులను మేత కు అనుమతించాలని డిమాండ్ చేశారు. విష యం తెలుసుకున్న జన్నారం ఎస్‌ఐ రాజవర్దన్‌తో పాటు దండేపల్లి, లక్షెట్టిపేట ఎస్‌ఐలు ఉదయ్ కుమార్, స తీష్‌లు సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. అటవీ శాఖ అధికారులో మా ట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రై తు లు రాస్తారోకో విరమించారు. ఈ విషయంపై ఎఫ్ ఆర్‌వో శ్రీనివాస్‌ను వివరణ కోరగా ఎలాంటి దాడి చేయలేదని ఇప్పటికే 232,239 కంపార్టుమెంట్లలో పశువులను మేపేందుకు అనుమతులు ఇచ్చామని, పై అధికారులతో మాట్లాడి మరిన్ని కంపార్టుమెం ట్లను కేటాయించేలా చర్యలు తీసుకుంటామన్నారు.