Share News

పత్తి కొనుగోలు చేయడం లేదని రైతు నిరసన

ABN , Publish Date - Mar 05 , 2025 | 12:08 AM

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట సీసీఐ సెంటర్‌లో పత్తి కొనుగోళ్లు చేపట్టడం లేదని రైతు నిరసన తెలిపాడు.. మండలంలోని జెండవెంకటాపూర్‌ గ్రామానికి చెందిన రైతు కారుకూరి కిషన్‌ తాను పండించిన పత్తిని ఈనెల 2వ తేదీన సీసీఐ సెంటర్‌కు తెచ్చాడు..

పత్తి కొనుగోలు చేయడం లేదని రైతు నిరసన

లక్షెట్టిపేట, మార్చి4 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట సీసీఐ సెంటర్‌లో పత్తి కొనుగోళ్లు చేపట్టడం లేదని రైతు నిరసన తెలిపాడు.. మండలంలోని జెండవెంకటాపూర్‌ గ్రామానికి చెందిన రైతు కారుకూరి కిషన్‌ తాను పండించిన పత్తిని ఈనెల 2వ తేదీన సీసీఐ సెంటర్‌కు తెచ్చాడు.. సెంటర్‌ నిర్వాహకులు మిల్లులో పత్తి నిలువలు ఎక్కువగా ఉన్నాయంటూ కొనుగోళ్లను నిలిపివేసారు. కానీ జిన్నింగ్‌ మిల్లులో నిలువలు లేవని మిల్లు మొత్తం ఖాళీగా ఉందని దళారులు తక్కువ ధరకు కొని ఇదే మిల్లులో అన్‌లోడ్‌ చేస్తున్నారంటూ సదరు రైతు ఆవేదన వ్యక్తం చేసాడు. ఎన్ని సార్లు అడిగినా పత్తి కొనకపోవడంతో విసుగు చెంది తాను తెచ్చిన పత్తి లోడ్‌ ట్రాక్టర్‌ను జాతీయ రహదారికి అడ్డంగా పెట్టి ట్రాక్టర్‌ పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేసాడు. సమాచారం అందుకున్న లక్షెట్టిపేట ఎస్సై సతీష్‌ అక్కడకు చేరుకుని రైతుకు నచ్చజెప్పడంతో శాంతించాడు. కావాలనే దళారులు రైతుల పొట్టగొడుతున్నారని క్వింటాలుకు వెయ్యి రూపాయల వరకు తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇదే సీసీఐలో అమ్మకాలు జరుపుతున్నట్లు రైతు ఆరోపించాడు.

Updated Date - Mar 05 , 2025 | 12:08 AM