Share News

Expired Beer: గడువు తీరిన బీరు తాగి ఆస్పత్రిపాలు

ABN , Publish Date - Aug 30 , 2025 | 02:37 AM

గడువు తీరిన బీరు తాగి అస్వస్థతకు గురై ఓవ్యక్తి ఆస్పత్రిపాలయ్యాడు. సిద్దిపేట జిల్లా చెందిన వీరబత్తిని శ్యాం(37) స్థానిక రేణుకా వైన్స్‌లో గురువారం రెండు బీర్లు కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లి సేవించాడు.

Expired Beer: గడువు తీరిన బీరు తాగి ఆస్పత్రిపాలు

  • సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఒకరికి అస్వస్థత

  • జోగిపేటలో బిర్యానీలో బొద్దింక

దుబ్బాక/జోగిపేట రూరల్‌, ఆగస్టు29(ఆంధ్రజ్యోతి): గడువు తీరిన బీరు తాగి అస్వస్థతకు గురై ఓవ్యక్తి ఆస్పత్రిపాలయ్యాడు. సిద్దిపేట జిల్లా చెందిన వీరబత్తిని శ్యాం(37) స్థానిక రేణుకా వైన్స్‌లో గురువారం రెండు బీర్లు కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లి సేవించాడు. కాసేపటికే అస్వస్థతకు గురైన శ్యాం.. బీరు సీసాలను పరిశీలించగా ఆగస్టు 13కే వాటి గడువు ముగిసినట్టు(ఎక్స్‌పైర్‌ అయినట్టు) ఉంది. దీంతో అదే దుకాణానికి వెళ్లిన శ్యాం మరో బీరు కొనుగోలు చేయగా అది కూడా గడువు తీరిన సరుకుగా గుర్తించి నిర్వాహకులను నిలదీశారు.


అదే సమయంలో శ్యాంకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కాగా, సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని అరోమా రెస్టారెంట్‌లో ఓ వ్యక్తి వెజ్‌ బిర్యానీ ఆర్డర్‌ చేయగా అందులో బొద్దింక కనిపించింది. ఇదేమని నిర్వాహకులను ప్రశ్నించగా.. వేడివేడి బిర్యానీలో బొద్దింక ఎలా వస్తుందని తమను ఎదురు ప్రశ్నించారని బాధితులు తెలిపారు. మెదక్‌ జిల్లా కౌడిపల్లికి చెందిన సతిష్‌ కుమార్‌ రెడ్డికి ఈ చేదు అనుభవం ఎదురైంది.

Updated Date - Aug 30 , 2025 | 08:22 AM