Share News

కాంగ్రెస్‌ పదవులపై ఉత్కంఠ...

ABN , Publish Date - Jan 30 , 2025 | 11:36 PM

నామి నేటెడ్‌తో పాటు డీసీసీ పదవుల భర్తీకి కాంగ్రెస్‌ పార్టీ భారీ కసరత్తు చేస్తోంది. పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో పదవుల నియామకం చేపట్టనుండ టంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

కాంగ్రెస్‌ పదవులపై ఉత్కంఠ...

-నామినేటెడ్‌తో పాటు డీసీసీ పదవుల కసరత్తు

-జిల్లా స్థాయిలోనూ పదవుల భర్తీకి సన్నాహాలు

-రాష్ట్ర కమిటీలో చోటు కోసం నేతలు ప్రయత్నాలు

-డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యేలకే అవకాశాలు..!

-కీలక పదవుల్లో నియామకాలపై టీపీపీసీ దృష్టి

మంచిర్యాల, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): నామి నేటెడ్‌తో పాటు డీసీసీ పదవుల భర్తీకి కాంగ్రెస్‌ పార్టీ భారీ కసరత్తు చేస్తోంది. పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రంలో పదవుల నియామకం చేపట్టనుండ టంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో పదవులు ఆశించి భంగపడ్డ నేతలు, జిల్లా స్థాయిలో పార్టీ కో సం ఏళ్లతరబడి కష్టపడ్డ కార్యకర్తలకు పార్టీ పదవు ల్లో పెద్దపీట వేస్తామని, త్వరలో నామినేటెడ్‌తో పాటు పార్టీ పదవుల కేటాయింపు ఉంటుందని అధి ష్టానం ప్రకటించింది. దీంతో ఆ పార్టీ క్యాడర్‌లో ఆ నందోత్సాహాలు నెలకొన్నాయి. దీంతో పదవులు ఆశి స్తున్న నాయకులు ఎమ్మెల్యేల ద్వారా పార్టీ అధిష్టానా నికి విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇదిలా ఉండగా డీసీసీ పదవిని జిల్లాలోని శాసనసభ్యులకే ఇవ్వాలని పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించిన నేపథ్యంలో అది తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. త్వరలో పదవులు భర్తీ చేసేందుకు అధిష్టానంగా ప్రయత్నిస్తుండగా ఎవరె వరికి ఏయే పదవులు లభిస్తాయన్నది ఉత్కంఠగా మారింది.

డీసీసీ పదవి వరించేదెవరినో...?

కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్ష పదవిని ఎమ్మెల్యేలకి ఇవ్వా లని అధిష్టానం సూత్రపాయంగా నిర్ణయించి నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే డీసీసీ పదవిని చే పట్టేందుకు ఎమ్మెల్యేలు ఆసక్తిగా లేరని తెలుస్తోంది. ఒకవేళ ఎమ్మెల్యేలు ఆసక్తి చూపని పక్షంలో సీనియర్‌ నేతలు, క్రియాశీలకంగా ఉన్న నేతల పేర్లను అధి ష్టానం పరిశీలిస్తుందనే ప్రచారం జరుగుతోంది. దీం తో జిల్లా అధ్యక్ష పదవి హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు సతీమణి కొక్కిరాల సురేఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రెండు పర్యాయాలుగా ఆమె పదవిలో ఉండగా, జిల్లా క్యాడర్‌ను ఏకతాటిపై ఉంచారన్న పేరు సురేఖకు ఉంది. అయితే ప్రభుత్వం నిర్ణయం మేరకు మార్పులు జరిగే అవకాశాలు ఉం టాయన్న ప్రచారం జరుగుతోంది. ఒకవేళ డీసీసీ అధ్యక్షులుగా కొత్తవారిని నియమిస్తే ఎవరికి ఆ పద వి వరిస్తుందోనన్న చర్చ జోరుగా సాగుతోంది. మంచి ర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజక వర్గా ల పరిధిలో సీనియర్‌ నాయకులు ఉండగా, వారంతా ప్రస్తుతం ఆయా నియోజక వర్గాల ఎమ్మెల్యేల కనుస న్నల్లోనే నడుస్తున్నారు. దీంతో డీసీసీ పదవిని అలం కరించే స్థాయి గల వ్యక్తుల వివరాలను అధిష్టానం తెప్పించుకునే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం పదవిలో ఉన్న కొక్కిరాల సురేఖనే మరో మారు కొనసాగించవచ్చుననే ప్రచారం కూడా ఉంది. మరోవైపు డీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారిలో చెన్నూరు నియోజక వర్గానికి చెందిన సీనియర్‌ నేత పురాణం సతీష్‌కుమార్‌ పేరు ప్రముఖంగా వినిపి స్తోంది. ఆయన బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉండగా 12 ఏళ్లు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. అలాగే టీడీపీ హయాంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా ఆరేళ్ల పాటు బాధ్యతలు నిర్వహించా రు. టీఆర్‌ఎస్‌ పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా, స్టేట్‌ సెక్ర టరీగా పని చేశారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, మా జీ విప్‌ నల్లాల ఓదెలు పేరు కూడా డీసీసీ అధ్యక్ష పదవికి వినిపిస్తుండగా ఆ పదవిని చేపట్టేందుకు ఆ యన సుముఖంగా లేరని తెలుస్తోంది. అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పీసీసీ మెంబర్‌గా ఉన్న రామకృ ష్ణాపూర్‌కు చెందిన సీనియర్‌ నేత పిన్నింటి రఘు నాథ్‌రెడ్డి కూడా డీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ఆయన ఉమ్మడి ఆదిలాబాద్‌ యూత్‌ జిల్లా అధ్యక్షుడిగా, ఎన్‌ ఎస్‌యూఐ అధ్యక్షు డిగా, పీసీసీ కార్యదర్శిగా, లీడర్‌ డెవలప్‌మెంట్‌ మిషన్‌ ఆదిలాబాద్‌, నాగర్‌ కర్నూల్‌ పార్లమెంట్‌ కో ఆర్డినేటర్‌గా పని చేసిన అనుభవం రఘునాథ్‌రెడ్డికి ఉంది. డీసీసీ పదవి భర్తీ పీసీసీ చేతిలో ఉండగా, ఆది ఎవరిని వరిస్తోందన్న చర్చ సాగుతోంది.

మంత్రి పదవిపై ఎమ్మెల్యేల ఆశలు...

రాష్ట్రంలో నామినేటెడ్‌, డీసీసీ అధ్యక్షుల పోస్టుల తోపాటు మంత్రి వర్గాన్ని కూడా విస్తరించే యోచన లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఉంది. మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలు, ఆ కారణంగానే డీసీ సీ పదవిపై ఆనాసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవి రేసులో మంచిర్యాల, చెన్నూరు, బెల్లం పల్లి నియోజక వర్గాల ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేం సాగర్‌రావు, గడ్డం వికానంద, గడ్డం వినోద్‌లు ఉన్నా రు. వారంతా మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద కుమారుడు వంశీకృష్ణ పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యుడి గా ఉన్నందున మంత్రి పదవి మళ్లీ ఆ కుటుంబానికి వెళ్తుందా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. గడ్డం సోదరులు అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే కాంగ్రెస్‌లో చేరారు. గడ్డం సోదరులకు ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్‌ పెద్దలతో సత్సంబంధాలు ఉన్నందున వా రిలో ఒకరికి మంత్రి పదవి ఖాయమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో వేచి చూడాల్సిందే.

Updated Date - Jan 30 , 2025 | 11:37 PM