Eshwari Bai: ప్రపంచానికి తెలియాల్సిన యోధురాలు ఈశ్వరీబాయి ప్రొఫెసర్ లారెన్స్ సైమన్
ABN , Publish Date - Feb 25 , 2025 | 05:01 AM
ఆమె సామాజిక, రాజకీయ పోరాట జీవితం ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సోమవారం రవీంద్రభారతిలో ఈశ్వరీబాయి 34వ వర్థంతి సభ జరిగింది.
సైమన్‌కు ఈశ్వరీబాయి పురస్కార ప్రదానం
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): అణగారిన వర్గాల అభ్యున్నతికోసం పోరాడిన ఈశ్వరీబాయి పేరు చిరస్థాయిగా నిలుస్తుందని అంతర్జాతీయ అభివృద్ధి, సుస్థిరాభివృద్ధి కేంద్రం సంచాలకుడు ప్రొఫెసర్ లారెన్స్ సైమెన్ కొనియాడారు. ఆమె సామాజిక, రాజకీయ పోరాట జీవితం ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సోమవారం రవీంద్రభారతిలో ఈశ్వరీబాయి 34వ వర్థంతి సభ జరిగింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ లారెన్స్ సైమన్‌కు ఈశ్వరీబాయి స్మారక పురస్కారాన్ని మాజీ మంత్రి గీతారెడ్డి ప్రదానం చేశారు. ఈశ్వరీబాయి కుమార్తె గీతారెడ్డి, అల్లు డు డాక్టర్ రామచంద్రారెడ్డి, విశ్రాంత ఐఆర్‌ఎస్ అధికారి వినోద్ కుమార్, అంబేడ్కర్ వాది వీబీరాజు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, సంగీత, నాటక అకాడమీ అధ్యక్షురాలు అలేఖ్య పుంజాల, సాం స్కృతిక సారథి చైర్‌పర్సన్ వెన్నెల గద్దర్ పాల్గొన్నారు.