Share News

స్నేహపూర్వకంగా ఉంటూనే సమస్యలు పరిష్కరించుకుంటాం: ఉద్యోగులు

ABN , Publish Date - Jun 07 , 2025 | 04:48 AM

ప్రభుత్వంతో స్నేహపూర్వకంగా ఉంటూనే సమస్యలు పరిష్కరించుకోవాలనే ఆలోచనా విధానంతో పని చేస్తున్నామని ఉద్యోగుల ఐకాస చైర్మన్‌ మారం జగదీశ్వర్‌

స్నేహపూర్వకంగా ఉంటూనే సమస్యలు పరిష్కరించుకుంటాం: ఉద్యోగులు

హైదరాబాద్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వంతో స్నేహపూర్వకంగా ఉంటూనే సమస్యలు పరిష్కరించుకోవాలనే ఆలోచనా విధానంతో పని చేస్తున్నామని ఉద్యోగుల ఐకాస చైర్మన్‌ మారం జగదీశ్వర్‌, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస్‌ రావు పేర్కొన్నారు. ఉద్యోగుల డిమాండ్ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించినందుకు సీఎం రేవంత్‌ రెడ్డికి, మంత్రివర్గ ఉపసంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు అండగా నిలుస్తుందని మరో ఐకాస చైర్మన్‌ వి.లచ్చిరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Jun 07 , 2025 | 04:48 AM