స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలి
ABN , Publish Date - Jan 07 , 2025 | 01:16 AM
స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే నేనావత బాలునాయక్ అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలి
ఎమ్మెల్యే నేనావత బాలునాయక్
పెద్దఅడిశర్లపల్లి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే నేనావత బాలునాయక్ అన్నారు. మండలంలోని అంగడిపేట ఎ క్స్‌రోడ్డులో సోమవారం నిర్వహించిన ఉమ్మడి పీఏపల్లి మండల ముఖ్య కార్యకర్తల స మావేశానికి ఆయన ముఖ్యఅతిఽథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం అమ లు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలందరూ సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంతరెడ్డి అభివృద్ధి, సంక్షేమంతో పాటు పేదల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తుందన్నారు. ఆరు గ్యారెంటీలను అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రైతును రాజును చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిందన్నారు. నియోజకవర్గంలోని రైతాంగానికి సాగునీరు అందించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో పార్లమెంటరీ కో ఆర్టినేటర్ సిరాజ్‌ఖాన, జిల్లా ప్రధాన కార్యదర్శి కుక్కల గోవర్ధనరెడ్డి, మండల అధ్యక్షుడు వీరబోయిన ఎల్లయ్యయాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్మటి సతీ్‌షరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోడియానాయక్, మండల ప్రధాన కార్యదర్శి ఆడేపు సతీష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన ఏడుకొండలుయాదవ్, నాయకులు వంగాల ప్ర తాప్‌రెడ్డి, కసిరెడ్డి శ్రీనివా్‌సరెడ్డి, జయంతరెడ్డి, ముచ్చర్ల శ్రీకాంతయాదవ్, చంద్రారెడ్డి, నీలం శ్రీనివా్‌సయాదవ్, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.