Educational OTT: దేశంలోనే తొలి ఎడ్యుకేషనల్ ఓటీటీ ఏకలవ్య ప్రారంభం
ABN , Publish Date - Sep 06 , 2025 | 04:29 AM
దేశంలోనే మొట్టమొదటి విద్యా సంబంధింత అంశాలతో ఏకలవ్య పేరుతో ఓటీటీ ప్రారంభమైంది. టైమ్, ఆహ గురు వంటి అగ్రశేణి బ్రాండ్లను ఏకం చేస్తూ విద్యలో విప్లవాత్మక మార్పుగా దీనికి రూపకల్పన చేశారు.
విద్యలో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం
ప్రతి సబ్జెక్ట్‌పై సులభంగా అర్థమయ్యే కంటెంట్
హైటెక్ సిటీ, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): దేశంలోనే మొట్టమొదటి విద్యా సంబంధింత అంశాలతో ఏకలవ్య పేరుతో ఓటీటీ ప్రారంభమైంది. టైమ్, ఆహ గురు వంటి అగ్రశేణి బ్రాండ్లను ఏకం చేస్తూ విద్యలో విప్లవాత్మక మార్పుగా దీనికి రూపకల్పన చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ మాదాపూర్‌లోని హోటల్ ఆవాసాలో దీన్ని ఆవిష్కరించారు. ఎస్‌ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీకి చెందిన ఏకలవ్య ఎడ్యుకేషనల్ సంస్థ రూపొందించిన ఈ ఓటీటీని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏకవల్య చైర్మన్ సంతో్‌షరెడ్డి మాట్లాడుతూ జాతీయస్థాయి ఉత్తమ విద్యావంతులు రూపొందించిన కంటెంట్ ఇందులో ఉంటుందని తెలిపారు. నెట్‌ఫ్లిక్స్ కాన్సె్‌ప్టపై రూపొందించిన ఈ ఫ్లాట్‌ఫాం ఇప్పటి ఎడ్యుటెక్ కఠినమైన సమస్యలకు పరిష్కారం చూపనుందన్నారు. ప్రతి సబ్జెక్ట్‌పై ఇందులో కంటెంట్ ఉంటుందని, విద్యార్థులు సులువుగా నేర్చుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో సంస్థ సీఈవో అనిల్ దీపక్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి, నాగేష్ పెండెం, అజయ్‌కుమార్ కొండపర్తి తదితరులు పాల్గొన్నారు.