తండాల అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Mar 06 , 2025 | 11:39 PM
ప్రజా పాలన ప్రభుత్వం తండాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేశ్ రెడ్డి
బిజినేపల్లి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి) : ప్రజా పాలన ప్రభుత్వం తండాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు. మండలంలోని వసురాంతండాలో గురువారం నూతన గ్రామ పంచాయతీ భవనా న్ని ప్రారంభించి మాట్లాడారు. తండాల్లో అంత ర్గత రోడ్ల అభివృద్ధికి, డ్రైనేజీ, పాఠశాలలో మౌళిక వసతులు వంటి అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపిస్తే నిధులు మంజూరు చేయిస్తానని అన్నారు. ఇల్లు లేని ప్రతీనిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తామన్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా మం జూరైన రూ.20 లక్షల నిధులతో గ్రామ పంచా యతీ భవనం నిర్మాణం చేపట్టినట్లు పంచాయ తీ కార్యదర్శి శ్రీజ తెలిపారు. అంతకు ముందు అలుగు తండా, వసురాంతండాల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మిద్దె రాములు, వెంకటస్వామి, హరీష్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, వీరేం దర్, రాంచందర్ నాయక్, మాజీ సర్పంచులు అవంతి శంకర్, గంగనమోని తిరుపతయ్య, రాంచందర్, అమృత్‌రెడ్డి, గోవిందు నాయక్, బసవ రెడ్డి ఉన్నారు.