Share News

చెర్కూర్‌లో ఈదమ్మమాందాత బోనాలు

ABN , Publish Date - Jan 16 , 2025 | 11:38 PM

మండల పరిధిలోని చెర్కూర్‌ గ్రామంలో ఈదమ్మమాందాత బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు.

చెర్కూర్‌లో ఈదమ్మమాందాత బోనాలు
అమ్మవారికి పట్టువస్త్రాలు తీసుకెళ్తున్న జైపాల్‌యాదవ్‌, గోలి శ్రీనివాస్‌రెడ్డి

వెల్దండ, జనవరి 16 (ఆంధ్రజ్యోతి) : మండల పరిధిలోని చెర్కూర్‌ గ్రామంలో ఈదమ్మమాందాత బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. వివిధగ్రామాల నుంచి భక్తులు పెద్దఎత్తున హాజరై అమ్మవారికి పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌రెడ్డిలు ఉత్సవాలకు హాజరై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యురాలు ద్యాప విజితారెడ్డి, నాయకులు నిరంజన్‌, భాస్కర్‌రావు, భీమయ్యగౌడ్‌, జంగిలి యాదగిరి, ప్రసాద్‌, అశోక్‌, నర్సింహ, శేఖర్‌ ఉన్నారు.

Updated Date - Jan 16 , 2025 | 11:38 PM