Education Policy: విద్యార్థుల ఉత్తీర్ణత.. ఉపాధ్యాయుల బాధ్యత
ABN , Publish Date - Feb 12 , 2025 | 05:53 AM
విద్యార్థులందరూ పాసయ్యేలా ఉపాధ్యాయులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలని కోరారు.

విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా
హైదరాబాద్, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి పదో తరగతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించడం ఉపాధ్యాయుల బాధ్యత అని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా అన్నారు. విద్యార్థులందరూ పాసయ్యేలా ఉపాధ్యాయులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలని కోరారు. పదోతరగతి విద్యార్థులకు సలహాలు, సూచనలు అందించేందుకు మంగళవారం టీ-శాట్ నిర్వహించిన ప్రత్యక్ష ప్రసారంలో యోగితా రాణా మాట్లాడారు. విద్యార్థుల బలహీనతలను ఉపాధ్యాయులు గుర్తించి, వాటిని అధిగమించేందుకు కృషి చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 11,544 పాఠశాలల్లో 4,97,240 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలకు హాజరవుతున్నారని ఆమె తెలిపారు.