Scope Eminence Award: ఈసీఐఎల్‌కు స్కోప్ ఎమినెన్స్ అవార్డు
ABN , Publish Date - Aug 30 , 2025 | 01:34 AM
ఎలక్ట్రానిక్స్ రంగంలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఈసీఐఎల్ సంస్థ ప్రతిష్ఠాత్మక స్కోప్ ఎమినెన్స్ అవార్డును దక్కించుకుంది. 2022-23 సంవత్సరానికి ఇన్‌స్టిట్యూషనల్ ఎక్సలెన్స్ కేటగిరీలో ఈ అవార్డు లభించింది.
కుషాయిగూడ, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ఎలక్ట్రానిక్స్ రంగంలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఈసీఐఎల్ సంస్థ ప్రతిష్ఠాత్మక స్కోప్ ఎమినెన్స్ అవార్డును దక్కించుకుంది. 2022-23 సంవత్సరానికి ఇన్‌స్టిట్యూషనల్ ఎక్సలెన్స్ కేటగిరీలో ఈ అవార్డు లభించింది. శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనురాగ్ కుమార్, టెక్నికల్ డైరెక్టర్ అనేష్ కుమార్ శర్మ అందుకున్నారు. ఈ అవార్డు ద్వారా సాంకేతిక పురోగతిలో తమ అగ్రగామి స్థాయి మరింత బలోపేతమైందని, బహుళ కీలక రంగాల్లో వ్యూహాత్మక ఎలకా్ట్రనిక్ ఉత్పత్తుల ఆవిష్కరణలకు ఇది మరింత చేయూతనిస్తుందని సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. కార్పొరేట్ పాలన, ఆర్థిక నిర్వహణ, సామాజిక బాధ్యతలో అత్యుత్తమ పనితీరును ప్రదర్శించే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలకు స్కోప్ ఎమినెన్స్ అవార్డు ఇస్తారు.